NewsOrbit
న్యూస్

రెండు క్లారిటీలు: బీజేపీ – జనసేన వాయిస్ ని సరిగ్గా గమనించారా?

గతరెండు రోజుల క్రితం అమరావతిలో రైతుల దీక్షకు ద్విశత దినోత్సవ కార్యక్రమం జరిగింది. సుమారు 200 దేశాల్లో ఈ కార్యక్రమం జరిగిందని.. అన్ని దేశాల్లోనూ ఉన్న టీడీపీ కార్యకర్తలు, గుంటూరు – కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. ఫ్లకార్డులు చేతబూని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… గత కొన్ని రోజులుగా మిగిలిన పక్షాల నుంచి కాస్త గట్టిగా, టీడీపీ నుంచి ఒక మోస్తరుగా వినిపిస్తున్న మాట… బీజేపీ నుంచి క్లారిటీ కావాలని, ప్రధాని కల్పించుకోవాలని!

అయితే… తాజాగా బీజేపీ నుంచి ఒకమోస్తరు క్లారిటీ వచ్చిందనే విషయం బీజేపీ నేత సునీల్‌ దేవధర్‌ నుంచి, వారి మిత్రుడు జనసేన పవన్ నుంచి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు! “అమరావతి రైతులకు అన్యాయం జరిగితే మాత్రం జనసేన – బీజేపీలు పోరాడతాయని… రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని” చెబుతున్నారు సునీల్ దేవధర్! ఆ మాట కాసేపు పక్కన పెడితే… జనసేనాని పవన్ స్పందనను కూడా ఒకసారి పరిశీలిద్దాం!

“రైతులు చేసిన త్యాగాలను వృథా కానివ్వబోము.. రైతుల పోరాటానికి తాము కూడా మద్దతిస్తాము.. బీజేపీతో కలిసి రైతులకు అండగా నిలబడతాము.. రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు విషయంలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు..” అని అన్నారు పవన్! ఇక్కడ సరిగ్గా గమనిస్తే… బీజేపీ – జనసేనల నుంచి రాజధాని విషయంలో పూర్తి క్లారిటీ వచ్చినట్లేనని అంటున్నారు విశ్లేషకులు.

అంటే… ఇక్కడ రెండు క్లారిటీలు ఉన్నాయి! “అమరావతి రైతులకు అన్యాయం జరిగినా.. కౌలు ఇవ్వడంలో తాత్సార్యం చేసినా.. బీజేపీ – జనసేన కూటమి పోరాడుతుంది.. రైతుల పక్షాన నిలబడుతుంది” అనేది ఒక క్లారిటీ కాగా… “రాజధాని విశాఖకు వెళ్లినా, కర్నూలు వెళ్లినా తమకు అభ్యంతరం లేదు.. అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం” అనేది రెండో క్లారిటీ అని అంటున్నారు విశ్లేషకులు! సో… బీజేపీనే కాదు.. పరోక్షంగా జనసేన కూడా అమరావతిపై క్లారిటీ ఇచ్చేసినట్లే ననే కామెంట్లు వినిపిస్తున్నాయి!!

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju