Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిరకాల కోరిక ముఖ్యమంత్రి అని అందరికీ తెలుసు.

నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది అదే రీతిలో ప్రజలలో మార్పు కూడా తీసుకురావాలి బలమైన సంకల్పం ఉంది అని చాల సందర్భాలలో జనసేన సమావేశాలలో పవన్ స్పష్టం చేయడం జరిగింది. దానికిగాను జనసేన కార్యకర్తలు అభిమానులు క్రమశిక్షణగా వ్యవహరిస్తేనే సాధ్యమవుతుందని తెలపడం జరిగింది. ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాక కాపు సామాజిక వర్గానికి కూడా పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలన్న కోరిక బలంగా ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుండో టాక్ వుంది. ఇలాంటి తరుణంలో పవన్ ఆశల మీద నీళ్లు జల్లి నట్లు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన వున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. సోము వీర్రాజు ఇటీవల మాట్లాడుతూ బీసీ వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రిని చేసే దమ్ము జగన్ కి గాని చంద్రబాబు కి గాని ఉందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రీతిలో ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి బిజెపి పార్టీ పని చేయటం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ద్వారా రూపురేఖలు మార్చాలి అన్నదే, మా ధ్యేయం అంటూ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. దీంతో సోము చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కి బిజెపి చెక్ పెట్టినట్టు అన్న టాక్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బలం గా వినబడుతుంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన పార్టీ టీడీపీతో ములాకత్ అయి పోటీ చేయడం వంటి వార్తలు వినపడ్డాయి. దీంతో బిజెపి పవన్ ని చాలా లైట్ తీసుకున్నట్లు, చంద్రబాబు కోవర్టుగా బీజేపీతో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.