BJP: సోము వీర్రాజు వీరత్వం చూసి సొంత పార్టీ నేతలే భయపడుతున్నారు?

BJP Leader: Miss Clarity Missing Vote Bank in AP BJP
Share

BJP: ఒకవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనివార్యమని తేటతెల్లమవుతుంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కొత్త పాట అందుకున్నారు. ఏడవ తేదీ నుండి టెండర్లను సైతం కేంద్రం ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో… ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరిగినప్పటికీ తాము దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపి తీరుతామని ఏపీ బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు.

 

BJP leaders afraid of Somu Veerraju

రాష్ట్ర బీజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు బలం చేకూరుస్తూ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. స్టీల్ ప్లాంటుని కాపాడే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ బిజెపి తీసుకుంటుందని అన్నారు. దీంతో విస్తుపోవడం సొంత పార్టీ నేతల వంతు అయింది. ఒకపక్క అధిష్టానం, హైకమాండ్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరాల్సిందే అని పట్టుపట్టుకొని కూర్చున్న సమయంలో సోము వీర్రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ సంధిగ్ధతలోకి నెట్టివేసింది.

ఇక ఇదే సమయంలో పోరాటాలు చేస్తున్న వారిపై కూడా సోము వీర్రాజు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తున్న నాయకులు… షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ చేసినప్పుడు ఏం చేశారని అన్నారు. ఒకేసారి సోము వీర్రాజు ఇలా రెండు వైపులా మాట్లాడడం పై తీవ్రమైన విస్మయం వ్యక్తమవుతోంది.

అంతేకాకుండా భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై కూడా అతను వింత వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల బిజెపి ఎంతగానో ఆవేదన చెందుతుంది అని ఆయన చెప్పడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రానికి ఆదాయవనరులు ఏమాత్రం కాదని చెప్పిన సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ దీని పట్ల ఆవేదన వ్యక్తం చేస్తుంటే ధరలు పెంచేది ఎవరు దాన్ని నియంత్రించే శక్తి ఎవరికి ఉంది అని ఈయనకి అసలు తెలుసా… తెలియదా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.


Share

Related posts

బ్రేకింగ్ : జేసీ ప్రభాకర్ రెడ్డి విడుదలతో దద్దరిల్లిన సెంట్రల్ జైల్

Vihari

రోజా బ్యాడ్ టైం… అటు జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌…ఇటు న‌గ‌రిలో

sridhar

EMI ల గురించి కంగారు పడుతున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే !

somaraju sharma