టాప్ స్టోరీస్ న్యూస్ వీడియోలు

బిజెపి నేతలపై జవాన్ బంధువు ఆగ్రహం

Share

పుల్వామా ఘటనలో మృతి చెందిన ఓ వీర జవాన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన బిజెపి నేతలకు చుక్కెదురైంది. బూట్లు ధరించి దహన కార్యక్రమం జరిగే ప్రదేశానికి రావటంతో జవాన్ బంధువులు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్త పద్దతిగా వ్యవహరించండి అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగింది.

కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్, ఉత్తరప్రదేశ్ మంత్రి సిద్దార్థ్ నాధ్ సింగ్, మీరట్ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ పుల్వామా ఘటనలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ అజయ్ కుమార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చారు. దహన కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశంలో కూర్చున్నారు. అయితే వీరు బూట్లు ధరించి ఆ ప్రదేశంలో కూర్చోవటాన్ని గమనించిన జవాన్ బంధువు ఒకడు నేతలపై మండిపడ్డాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. పద్దతిగా వ్యవరించాలని బిగ్గరగా అరిచాడు. దీంతో తమ తప్పును గ్రహించిన నేతలు చేతులు జోడించి క్షమాపణలు కోరారు. బూట్లను తొలగించారు. ఈ ఉదంతం అంతా ఎవరో మొబైల్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియోతో పాటు దహన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఈ నేతలు ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుతున్న వీడియో మరొకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అజయ్ కుమార్ కి 27 సంవత్సరాలు. మీరట్ లోని బస్సిటిక్రి గ్రామానికి చెందినవాడు. 2011 లో అజయ్ ఆర్మీలోకి వచ్చాడు. 2015 ఈయన వివాహం జరిగింది. ఈయనకి రెండేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. అజయ్ తండ్రి కూడా ఆర్మీకి చెందిన వ్యక్తే.

ఎన్డీటీవీ సౌజన్యంతో..  ఈ వీడియో కొరకు కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/watch?v=Gt9VVhAFLAU


Share

Related posts

నేను పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా ఇబ్బందేనా: రేణు దేశాయ్

Vihari

Manchu family : మంచు ఫ్యామిలీ హోప్స్ అన్నీ ఆ రెండు సినిమాల మీదేనా..!

GRK

కరోనా వ్యాక్సిన్ అంద‌రి కంటే ముందు మీకు రావాలంటే ఇలా చేస్తే చాలు

sridhar

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar