NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

హైదరాబాద్ మాకు వదిలేయ్ – గులాబీ రేకలు రాలిపోతున్నాయ??

 

 

కెసిఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. వెళ్లిన వెంటనే బిజెపి పెద్దలను ఒకరి తర్వాత ఒకర్ని కలుస్తున్నారు. ఇంత అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది…? పిలుపు ఎవరిది అక్కడ ఎలాంటి చర్చలు చేస్తున్నారు అనేది?? అంతా రహస్యమే అయినా, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి సీట్లు సాధించిన బిజెపి కచ్చితంగా మేయర్ పీఠం సాధించేందుకు కేసీఆర్తో మంతనాలు సాగిస్తున్నట్లు జోరుగా ప్రచారం అందుకుంది.

ఇస్తారా? జట్టు కడతారా??

టిఆర్ఎస్ బిజెపి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో బాహాబాహీ తలపడ్డాయి. 150 సీట్ల గ్రేటర్ వార్లో రెండూ పార్టీలు పరువు నిలబెట్టుకునే సీట్లే సంపాదించాయి. టిఆర్ఎస్ గత ఎన్నికల్లో 99 సీట్ల నుంచి 56 కు వస్తే, బి.జె.పి.తో 4 నుంచి ఏకంగా 46 కు వచ్చింది. అంటే ఈ ఎన్నికల్లో బీజేపీ భారీగా పుంజుకున్న ట్లే. గ్రేటర్ ఎన్నికలకు ఎన్నడూ లేనంతగా బిజెపి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కచ్చితంగా తెలంగాణలో బిజెపి మూలాలను బలపరచాలని కోణంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తో పాటు, అమిత సైతం ప్రచారంలో పాల్గొన్నారు. మరోపక్క ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం పదవి కూడా గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఉత్తరాది నేతలంతా హైదరాబాదులోని ప్రతి గల్లీకి తిరిగి బీజేపీ విజయానికి కృషి చేశారు. ఎంతటి కృషి ఉన్న సమయంలో బిజెపి మేయర్ పీఠానికి దూరంగానే ఆగిపోయింది. కేవలం 46 సీట్ల వద్దని ఆ పార్టీ ఆగిపోయింది. ఈ సంఖ్య గతంతో పోలిస్తే ఎక్కువే అయినా ఇంత మంది జాతీయ నాయకులు వచ్చి, కచ్చితంగా హైదరాబాదులో మేయర్ పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో అది చేరడం బీజేపీకి ప్రతిష్ఠతో కూడినదే. దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీజేపీ పెద్దలు చర్చలు జరిపేందుకు ఆయనను ఢిల్లీకి రమ్మన్నట్లు విశ్వసనీయ సమాచారం. బిజెపి ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మేయర్ పీఠం తమ ఖాతాలో ఈ సారి ఎలాగైనా వేసుకోవాలనే తలంపుతో బీజేపీ పెద్దలు కేసీఆర్ తో పావులు కదుపుతున్నారు. బిజెపి టిఆర్ఎస్ కలిసి హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని పంచుకోవాలని, దానిలో భాగంగా మొదట బీజేపీ కు మేయర్ స్థానం ఇచ్చేలా కేసీఆర్ తో ఒప్పందం చేసుకునేందుకు ఢిల్లీ పెద్దలు ఆయనను చర్చలకు ఆహ్వానించారు.

వదులుకుంటారా??

బిజెపి దక్షిణాదిన బలపడాలంటే హైదరాబాద్ మేయర్ పీఠం ఖాతాలో కచ్చితంగా ఉండాలి. ఇది ఉత్తరాది వారికి ఒక ఇండికేషన్ గా మారుతుంది. ఇది బిజెపి వ్యూహం. దీనికోసమే తెలంగాణలో రాజకీయ శత్రువుగా ఉన్న కెసిఆర్ తో సహితం మేయర్ పీఠం గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ స్థానాలు వచ్చిన టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కెసిఆర్ ఈ ప్రతిపాదనను ఒప్పుకుంటారా ఒకవేళ ఒప్పుకుంటే బీజేపీ కు అది ఎంతమేర ప్లస్ అవుతుందా అనేది వేచి చూడాలి. కచ్చితంగా బిజెపి తన వ్యూహంతో హైదరాబాద్ పై పట్టు సాధిస్తుంది. ఇది తెలంగాణ అంతటా వచ్చే 2023 ఎన్నికల్లో కనిపిస్తునంది అనడంలో సందేహం లేదు. మరోపక్క ముస్లిం పార్టీగా దేశమంతటా పోటీకి సై అంటున్న మజ్లిస్ పార్టీ ఇలాకాలో బిజెపి మేయర్ పీఠాన్ని అధిరోహిస్తే వారిపై పైచేయి సాధించినట్లు అవుతుందనేది లెక్క. మరి దీన్ని ఈ ఉద్యమ ముఖ్యమంత్రి ఏ మేరకు ముందుకు తీసుకెళ్తారు హైదరాబాద్ పీఠంపై ఏమైనా చిక్కుముడి వీడుతున్న అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

author avatar
Special Bureau

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!