NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

…ఐతే రజని లేదా అమ్మ పార్టీ ; “ఆపరేషన్ దక్షిణ కమలం” కు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం బీజేపీ

 

ఆపరేషన్ దక్షిణ కమలం… కాషాయ జెండా దక్షిణ భారతదేశంలో ఎగురవేయాలనేది బీజేపీ నాయకుల బలమైన వాంఛ. దీని కోసం ఉన్న దారులన్నీ వెతుకుతున్నారు. ఏ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ ఖాళీ ఉంది… దాన్ని ఎలా పూరించాలి… ఏ పద్దతిలో అక్కడ ఉన్న పార్టీలను తొక్కేయ్యాలి… అంటూ అన్ని లెక్కలను వేసుకుని కథ రాసుకుంది. ముఖ్యంగా తన టార్గెట్ తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల తో పటు కేరళ. రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఒక్కో అడుగు, ఒక్కో ఖాళీ పురిస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో మునుపటి కంటే పట్టు పెంచుకున్న కమలనాధులు…. ఇప్పుడు తమిళనాడు వైపు ఆశగా చూస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. దింతో పదును వ్యూహాలు సిద్ధం చేసే పనిలో….. మొదట బ్రహ్మ అస్త్రానికి మెరుగులు దిద్దుతున్నారు… దాని పేరే తలైవా ”రజనీకాంత్”.

రెండు పడవల మీద కాళ్ళు పెట్టినవారిని చూసి ఉంటారు… రెండు జతల బట్టల్ని వేసుకున్న వారిని చూసి ఉంటారు… బీజేపీ మాత్రం తమిళనాట అవకాశవాద, ప్రత్యామ్నాయ రాజకీయాలకే మొగ్గు చూపుతోంది.. ఎవరైనా పర్లేదు.. ఏదైనా పర్లేదు… ఆపరేషన్ దక్షిణ కమలం విజయవంతం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

(అదెలాగో చదవండి)

** తమిళనాట రాజకీయాలు వేరు. అక్కడి పద్ధతులు, సంప్రదాయాలు వేరు. జాతీయ పార్టీలను అక్కడి ప్రజలు పెద్దగా నమ్మరు. పట్టించుకోరు. డీఎంకె , అణా డీఎంకే మధ్యనే పోటీ ఉంటుంది . అధికారం సైతం ఈ రెండు పార్టీల మధ్యనే మారుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మూడో పార్టీ రక కోసం బీజేపీ వ్యూహాలు పన్నుతోంది.
** తమిళనాట చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవారి వరకు తెలిసిన పేరు రజని కాంత్. తమిళులు ఎక్కువగా స్థానికతనే ఇష్టపడతారు. బీజేపీ గత దశాబ్ద కలం నుంచి తమిళనాడులో విస్తరించాలని పన్నుతున్న వ్యూహాలు తమిళ ప్రజల ముందు నిలవడం లేదు. అయితే అణా డీఎంకే అధ్యక్షురాలిగా, తమినాడులో రెండో దఫా ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా జయలలిత వెంటనే ఆకాల మరణం చెందటం బీజేపీ ఆపరేషన్ కి కలిసి వచ్చింది.


** అణా డీఎంకే లో చిచ్చు రేపి ముఖ్యమంత్రి పీఠం కోసం పార్టీలో కీలకమైన పళనిస్వామి , పన్నీర్ సెల్వం చిచ్చు రేపేందుకు ప్రయత్నించినా అది అంత ఫలించలేదు. చిచ్చు పెట్టడం వాళ్ళ బీజేపీ కి కలిసి వచ్చే అంశాలు, బలపడేందుకు ఉన్న విషయాలు కనిపించకపోవడంతో ఇద్దరికి రాజి చేసి, ఆ పార్టీతో జత కట్టేలా ఒప్పందం చేసుకుంది. అంత తన గ్రిప్ లో ఉండేలా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ప్లాన్ చేసారు. ఇప్పుడు తమిళనాడులో సాగుతుంది అదే. పేరుకు అణా డీఎంకే ప్రభుత్వమే కానీ, నడిపించేది అంత బీజేపీ పెద్దలే అన్నది బహిరంగ రహస్యం.
** అయితే ఇక్కడితో బీజేపీ సర్దుకుపోదాం అన్న తీరును కనబరచలేదు. తమిళనాడులో ప్రతి ఐదేళ్లకు వచ్చే ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం రావడం ఆనవాయితీ. దాన్ని 2016 లో అణా డీఎంకే అధినేత్రిగా జయలలిత అధిగమించి రెండోసారి అధికారాన్ని చేపట్టారు. అయితే ప్రస్తుతం తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే బలం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు , కరుణానిధి మృతి సానుభూతి, స్టాలిన్ కు ఒక అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం తమిళుల్లో కనిపించడం బీజేపీ గ్రహించింది.


** స్టాలిన్ కు చెక్ పెట్టాలంటే ఉన్న పెద్ద అస్త్రం రజని ను ఇప్పుడు మచ్చిక చేస్కోవడం మొదలు పెట్టింది. గురువారం రజని కాంత్ ట్విట్టర్ లో తన రాజకీయ పార్టీ ప్రకటన డిసెంబర్ 31 న చేస్తానని చెప్పడం , వచ్చే ఏడాది ఎన్నికల నాటికీ అది ప్రజల్లోకి వెళ్తే విశేష ప్రజాభిమానం ఉన్న రజని తమినాడు రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అవుతారని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే రజని పార్టీ ప్రకటన మీద ఒక కర్చీఫ్ వేసి, ఆయనతో మాట్లాడి ఒక ఒప్పందం చేసుకునేందుకు అప్పుడే బీజేపీ పెద్దలు వ్యూహాలు వేస్తున్నారు. రజని తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు వరకు వెళ్తే ఆటోమేటిక్ గా పార్టీను తమిళనాడులో బలం పెంచుకోవచ్చు అనేది కమల దళం వ్యూహం.
** మరోపక్క ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్న అణా డీఎంకేను బీజేపీ ఒకేసారి వదలడానికి ఇష్ట పడటం లేదు. ఒకవేళ రజని బీజేపీ పొత్తు, మిత్రపక్షం వద్దు అనుకుంటే అణా డీఎంకే తో పటు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం రజని కనుక బీజేపీ దోస్తీకి సిద్ధం అయితే అణా డీఎంకేను కమలనాధులు పక్కన పెట్టేస్తారు. లేకుంటే మాత్రం అణా డీఎంకే తో పోటీ చేసి ఎలాగో పరువు నిలబెట్టుకునే రెండు పడవల సిద్ధాంతం మీద బీజేపీ ”ఆపరేషన్ దక్షిణ కమలం” పని చేస్తోంది.

author avatar
Special Bureau

Related posts

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N