BJP Minister Usha: ఆ మహిళా మంత్రి ఐడియా అదుర్స్..! ఇంత వరకూ ఏ ప్రజాప్రతినిధి అలా చేసి ఉండరు..!!

Share

BJP Minister Usha: ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటుంటారు. ఆ సమయంలో కొందరు కార్యకర్తలు, అభిమానులు తమ  నాయకుడు, నాయకురాలితో సెల్ఫీ దిగాలి అని కూడా కోరుకుంటుంటారు. అయితే నాయకులు ఫ్రీహాండ్ గా ఒదిలివేస్తే ప్రతి ఒక్కరూ సెల్ఫీ అంటూ ముందుకు రావడంతో ఆ నాయకులకు అక్కడే సమయం ఎక్కువ వృధా అవుతుంటుంది. వేరే కార్యక్రమాలకు వెళ్లేందుకు ఆలస్యం అవుతుంటుంది.

BJP Minister Usha Thakur innovative idea
BJP Minister Usha Thakur innovative idea

Read More: Vijaya Sai Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపి విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు..!!

ఈ ఇబ్బందుల నుండి అధిగమించేందుకు ఓ మహిళా మంతి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మధ్యప్రదేశ్ కు మహిళా మంత్రి ఉషా ఠాకూర్ తనతో ఎవరైనా సెల్ఫీ దిగాలంటే ఒక్కో సెల్ఫీకి రూ.100లు చార్జి చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఆదివారం వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆమె సమర్ధించుకున్నారు. తాను ఎక్కడ కార్యక్రమానికి వెళ్లినా అభిమానులు పెద్ద సంఖ్యలో సెల్ఫీ దిగేందుకు ముందుకు వస్తున్నారనీ, దీంతో తనకు చాలా సమయం వృధా అవుతుందన్నారు. ఈ నిర్ణయం ప్రకటించడంతో కొంత మంది మాత్రమే సెల్ఫీలు దిగుతున్నారనీ, దీంతో తనకు సమయం వృధా కాకుండా త్వరితగతిన వేరే కార్యక్రమాలకు వెళుతున్నానని చెప్పుకొచ్చారు.

అయితే ఈ సెల్ఫీ ల ద్వారా వసూలు అయ్యే రూ.100లు తాను తీసుకోననీ, ఆ మొత్తాన్ని పార్టీ కార్యక్రమాలకు అందిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా ఈ బీజేపీ మంత్రి మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తనను కలిసేందుకు వచ్చే కార్యకర్తలు, నేతలు పుష్పగుచ్చాలు, పుష్పాలు తీసుకురావద్దని వాటి బదులు నోటు పుస్తకాలు తీసుకురావాలని సూచించారు. పువ్వులను కేవలం దేవుళ్లు, దేవతలకు మాత్రమే సమర్పిస్తామని, కనుక తనకు పువ్వులు, పుష్పగుశ్చాలు ఇవ్వవద్దని తెలియజేశారు. పుస్తకాలు ఇవ్వడం వల్ల అవి పేద విద్యార్థులకు పంపిణీ చేయవచ్చని అన్నారు. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తుంది. బీజేపీ నేతలు ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, ఏదో పార్టీ కోసం పని చేశారన్న అభిమానంతో సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహపడితే దానికి కూడా ప్రజా ప్రతినిధి అయి ఉండి వారి వద్ద నుండి రుజుము వసూలు చేయడం ఏమిటని కొందరు విమర్శిస్తున్నారు.

ఈ మహిళా మంత్రి ఇంతకు ముందు కూడా అనేక విషయాల్లో వార్తల్లోకి ఎక్కారు. కరోనా వేళ విమానాశ్రయంలో పూజలు చేయడం, యోగా చేస్తే కరోనా వైరస్ సోకదని పేర్కొనడం,  ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తున్నందున రెండు డోసులు తీసుకున్న వారు పిఎం కేర్స్ కు రూ.500 విరాళం ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం లాంటివి చేసి విమర్శలను ఎదుర్కొన్నారు.


Share

Related posts

ఏం ప్రశ్నఇది అని జర్నలిస్టు పై కేసీఆర్ ఆగ్రహం

Siva Prasad

Eesha Rebba Latest photoshoot

Gallery Desk

West bengal Elections : బీహార్ ఫార్ములాతోనే బెంగాల్ బరిలో బీజేపీ..! ముస్లిం ఓట్ల కోసం ఎత్తులు – కత్తులు..!?

Srinivas Manem