‘కెసిఆర్ జైలుకు వెళ్లడం ఖాయం’

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని అన్నారు. త్వరలో కెసిఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అరవింద్ అన్నారు. ఆర్‌టిసి భూములను అమ్ముకునేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్‌టిసి కార్మికుల ఆత్మహత్యలకు కెసిఆర్ అహంకారపూరిత వైఖరే కారణమని అరవింద్ అన్నారు. కెసిఆర్‌ను కోర్టుకు లాగాలని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికలను కెసిఆర్ నిర్వహించడం లేదని అరవింద్ అన్నారు.