NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ విసుర్లు.. ఏపి ప్రజలను తిట్టినందుకు కేసిఆర్ ను సమర్దించాలా అంటూ ప్రశ్నాస్త్రాలు

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన జాతీయ పార్టీ విస్తరణ లో భాగంగా ఏపి నుండి పలువురు నేతలను పార్టీల్లో చేర్చుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఏపి శాఖకు తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడుగా నియమించారు. సంక్రాంతి పండుగ తర్వాత విజయవాడలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసిఆర్ పై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్శింహరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ పార్టీలు ఏపికి అవసరం లేదని అన్నారు. ఇక్కడి ప్రజలు కేసిఆర్ ను ఎందుకు సమర్ధించాలని ప్రశ్నించారు జీవీఎల్. గతంలో ఆంధ్ర ప్రజలను కేసిఆర్ తిట్టి, దుర్భాషలాడిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆంధ్రవాళ్లను తరిమి తరిమి కొడతామన్నందుకు సమర్దించాలా అని ప్రశ్నించారు.

BJP MP GVL Narsimha Rao Slams KCR

 

కోవిడ్ సమయంలో ఏపి ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ వెళుతుంటే వాహనాలను రాష్ట్ర సరిహద్దులో ఆపిన విషయాన్ని గుర్తు చేశారు జీవీఎల్. ఆంధ్ర కు రావాల్సిన నీటిని సముద్రం పాలు చేస్తున్నాడని కేసిఆర్ ను విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గించాలంటూ సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. ఏపిని ఎడారిలా మార్చాలనుకున్న కేసిఆర్ ఏపిలో ఎలా రాజకీయం చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపికి రావాల్సిన నిధులను ఇంత వరకూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత కేసిఆర్ ఏపిలోకి అడుగు పెట్టాలని జీవీఎల్ అన్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం ఖాయమని జీవీఎల్ అన్నారు. తెలంగాణలో తన ప్రాభవాన్ని కోల్పోవడంతో జాతీయ పార్టీ అంటూ కేసిఆర్ కొత్త రాగం అందుకున్నారని జీవిఎల్ విమర్శించారు. ముందు తెలంగాణలో ఉన్న సమస్యలను పరిష్కరించాలనీ, ఆ తర్వాత ఆంధ్రను ఉద్దరించడానికి రావాలని జీవిఅర్ కోరారు. మరో పక్క పక్క తెలంగాణలో కేసిఆర్ తో జత కట్టిన వామపక్షాలు ఏపిలో ఎటువంటి స్టాండ్ తీసుకుంటాయి అనే దానిపై ఇంక స్పష్టత రాలేదు. కర్ణాటకలో జేడీఎస్ మద్దతుతో పోటీ చేస్తామని ఇంతకు ముందు కేసేఆర్ ప్రకటించారు. కానీ ఏపిలో రాజకీయం విషయంపై కేసిఆర్ ఇంకా ప్రకటన చేయలేదు.

YSRCP Internal: రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు మళ్లీ ఖాయమే ..! కానీ..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju