NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

TMC Vs BJP: ముద్దు రేపిన మంట .. టీఎంసీ వర్సెస్ బీజేపీ

TMC Vs BJP: ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధులు, నేతలు నానా పాట్లు (తంటాలు) పడుతుంటారు. ఓట్లు అభ్యర్ధించడానికి రోడ్ సైడ్ హోటల్ కు వెళ్లి సమయంలో పెనంపై దోసెలు వేయడం,  ఇస్త్రీ బండి వద్దకు వెళితే కొద్దిసేపు ఇస్త్రీ పెట్టె పట్టుకుని బట్టలకు ఇస్త్రీ చేస్తున్నట్లుగా ఫోటో దిగడం, వృద్ధుల వద్దకు వెళ్లిన సమయంలో వాళ్ల చేతులు పట్టుకుని ఆరోగ్యం ఎలా ఉంది అని యోగ క్షేమాలు తెలుసుకోవడం, చిన్నారులు, యువతీ యువకులను ఏమి చదువుతున్నావు అంటూ పలకరించడం, చిన్నారులను ఆశీర్వదించడం, పెద్దల నుండి ఆశీర్వాదాలు తీసుకోవడం, చిన్నారుల నుదుట ముద్దు పెట్టడం వంటి పనులు చేస్తూ ఉంటారు.

అయితే ఒక్కో సందర్భంలో అభ్యర్ధులు చేసిన పనులు వివాదాస్పదం అవుతుంటాయి. ప్రత్యర్ధులకు అవి అస్త్రాలుగా మారుతుంటాయి. ఇప్పుడు అటువంటి ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ లో జరిగింది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ రాజకీయ పక్షాల అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకునేందుకు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. పశ్చిమ బెంగాల్ లోని ఓ బీజేపీ ఎంపీ కూడా ఇటీవల ఓట్ల కోసం ఇంటింటి ప్రచారం చేస్తున్న సమయంలో ఓ యువతి బుగ్గపై ముద్దు పెట్టుకోవడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బెంగాల్ లోని ఉత్తర మాల్దా లోక్ సభ నియోజకవర్గం నుండి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ ఖగేన్ ముర్మూ ఇటీవల ఇంటింటి ప్రచారం చేస్తూ ఓ ఇంటి వద్ద యువతి చెంపపై ముద్దు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఘటన రాజకీయ దుమారం రేగింది.

ఈ ఘటనపై అధికార టీఎంసీ సోషల్ మీడియాలో స్పందిస్తూ బీజేపీని దుయ్యబట్టింది. బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఓ యువతి పై ముద్దు పెట్టారు. మహిళా రైజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు.. బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే నేతలు.. ఇలా బీజేపీ క్యాంప్ లో మహిళా వ్యతిరేక నాయకులకు కొదవలేదు. నారీమణులకు మోడీ పరివార్ ఇస్తున్న గౌరవం ఇది. ఒక వేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి అంటూ టీఎంపీ విమర్శలు గుప్పించింది. ఈ అంశం వివాదం కావడంతో ఎంపీ ఖగేన్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. ఆమెను నా కుమార్తెలా భావించా. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి..కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారు. ఇలాంటి చిత్రాలను వక్రీకరించి వ్యక్తులు, పార్టీల పరువుకు భంగం కల్గిస్తున్నారు. వారిపై (టీఎంసీ) ఫిర్యాదు చేస్తాం అని ఖగేన్ పేర్కొన్నారు.

మరో పక్క ఈ వివాదంపై సదరు యువతి కూడా స్పందించింది. ఎంపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. తనను సొంత కూతురుగా భావించి ఆయన ముద్దు పెట్టుకుంటే అందులో సమస్య ఏమిటని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిది చెత్త మనస్తత్వంగా అభివర్ణించారు. ఆ ఫోటో తీసిన సమయంలో అక్కడే తన తల్లీదండ్రీ కూడా ఉన్నారని ఆమె వెల్లడించారు.

Lok Sabha Elections 2024: రాజకీయ పార్టీలు ఇకపై ఆ నిబంధనలు పాటించాల్సిందే .. ఈసీ కీలక ఆదేశాలు

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N