NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

BJP : ఏపీలో బీజేపీ కి కొత్త తలనొప్పులు..!!

BJP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ గా పైకి రావటానికి బిజెపి BJP వచ్చిన ఏ అవకాశాన్నివదులుకోవడం లేదు. మొన్నటి వరకు దేవాలయాల విగ్రహాల ధ్వంసం విషయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు, నిరసనలు చేపట్టడం అందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలో చాలావరకూ మతాలను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేసేది దేశంలో ఒక బీజేపీ యే అనే విమర్శలు రావడం జరిగాయి. ఇదిలా ఉంటే ఈ ఘటనలో ఎక్కువగా టిడిపి వాళ్ల పేర్లు బయటపడటంతో, చాలా వరకు విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించి ప్రతిపక్షాలు సైలెంట్ అయిపోయాయి. కావాలనే టిడిపి పార్టీకి చెందిన వాళ్లే విగ్రహాల ను టార్గెట్ చేసుకుని మతాల మధ్య కులాల మధ్య గొడవలు సృష్టించి రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మరోపక్క వైసీపీకి చెందిన కీలక నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రంలో ఎదగాలనుకునే బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లు అయింది. కేంద్రం తీసుకునే నిర్ణయం పై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు బగ్గు మంటున్నాయి.

BJP: New headaches for BJP in AP.
BJP New headaches for BJP in AP

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. ఒక విశాఖలో మాత్రమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా కార్మిక సంఘాలు బిజెపి పార్టీ పై భగ్గుమంటున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విషయంపై స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది పెద్ద ఉద్యమం అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎమ్మెల్సీ మాధవ్‌ కలిశారని.. జీవీఎల్‌ నరసింహారావు కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఈ విషయంలో మరోసారి కేంద్రం ఆలోచించే విధంగా పెద్దలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మొత్తంమీద ఏపీలో ఎదగాలని అనుకుంటున్న బీజేపీకి కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయం పెద్ద తలనొప్పి తీసుకువస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. 

 

 

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju