NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ బీజేపీ బంధువులు నాకడానికే పనికొస్తారా..? టీడీపీ త‌మ్ముళ్ళు జర ఆలోచించుకోండిరా..!

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదురుతుందా? కుదిరితే ఎలా ఉంటుంది? ఎలా ముందుకు సాగా లి? ఇదీ.. ఇప్పుడు ఆస‌క్తి రేపుతున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌లు దీనికి కార‌ణం.. సుమారు 7 సంవ‌త్స‌రాల‌కు పైగా టీడీపీకి, బీజేపీకి మ‌ధ్య బంధుత్వం లేదు. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు.. కారాలు మిరియాలు నూరుకున్నా రు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఏ కోశానా..ఈ ఏడేళ్ల కాలంలో క‌లిసి ప‌నిచేసింది కానీ.. క‌లిసి ఒక వేదిక‌పైకి వ‌చ్చింది కానీ.. లేని వైనం..ఇప్పుడు హ‌ఠాత్తుగా చేతులుక‌లుపుతున్న స‌మ‌యంలో చ‌ర్చ‌కు వ‌స్తోంది.

పొత్తు మంచిదే. అయితే..దీనికి ప్రాతిప‌దిక ఉండాలి. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. క్షేత్ర‌స్థాయిలో బీజేపీతో క‌లిసి వ‌చ్చే త‌మ్ముళ్లు ఎంద‌రు? అనేది చూస్తే.. చాలా చాలా త‌క్కువేన‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా ప్ర‌స్తుతం జ‌న‌సేన-టీడీపీ నేత‌ల‌ను క‌లిపేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలే ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కి చందంగా సాగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలోబీజేపీని కూడా వెంటేసుకుని తిర‌గాల‌న్న చంద్ర‌బాబు సూచ‌న‌లు ఏమేర‌కు త‌మ్ముళ్ల చెవికి ఎక్కుతాయో చూడాలి.

ఇక‌, ఈ విష‌యంలో బీజేపీ మ‌రో నాలుగు అడుగులు ముందుకు వేస్తోంది. మేం బ‌లంగా ఉన్నామ‌ని.. అందుకే చంద్ర‌బాబు త‌మ‌తో జ‌త క‌డుతున్నార‌న్న వాద‌నను ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న క‌మ‌ల నాథులు చెబుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో పెద్ద‌న్న‌గాముందుకు వ‌చ్చి.. ఇరు పార్ట‌ల‌కూ న‌చ్చ‌జెప్పే వెంక‌య్య నాయుడు వంటినాయ‌కులు లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. దీంతో బీజేపీదే పైచేయి అవుతుంద‌నే ఆవేద‌న త‌మ్ముళ్ల‌లో క‌నిపిస్తోంది.

మేం క‌ల‌సి ప‌నిచేసేందుకు రెడీగానే ఉన్నాం. చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిని చేసుకునేందుకు ఎన్ని త్యాగాల‌కైనా సిద్ధంగానే ఉన్నాం. కానీ, వారు మాపై పైచేయి సాధిస్తామంటేనే.. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల ను మేం కంట్రోల్ చేయ‌లేం అని విజ‌యన‌గ‌రం జిల్లాకుచెందిన కీల‌క నేత మాజీ మంత్రి ఒక‌రు నిర్మొహ‌మాటంగా చెప్పారు. ఇలాంటి ప‌రిస్థితి సీమ‌లో ఎక్కుగా ఉంది. విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఇప్ప‌టికే.. మంత్రులు, ప‌దవులు అంటూ బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీలో బంధువులు ఉన్నా.. క‌లిసి వ‌చ్చేవారు ఎంద‌రు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju