BJP First List: రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఓ పక్క బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ తమ అభ్యర్ధుల మొదటి జాబితా విడుదల చేయగా, ప్రచార పర్వంలో ఆ అభ్యర్ధులు ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ సీనియర్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బీజేపీ మొదటి జాబితా ఆలస్యం అయినట్లు తెలుస్తొంది. ఎట్టకేలకు కొద్ది సేపటి క్రితం బీజేపీ 52 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో పలువురు సీనియర్ నేతల పేర్లు కనిపించలేదు.
మొదటి జాబితాలో కిషణ్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ పేర్లు లేవు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు అసెంబ్లీకి పోటీ చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తొంది. బీజేపీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 52 మంది అభ్యర్ధుల్లో బీసీలు 17, ఎస్సీ 8, ఎస్టీ 6, ఓసీ పది, మహిళలు 12 మందికి అవకాశం కల్పించింది బీజేపీ. ఇక తొలి జాబితాలోనే ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాబూ రావు పేర్లును తొలి జాబితాలో ప్రకటించారు. సీనియర్ నేత ఈటల రాజేందర్ హూజురాబాద్‌తోపాటు సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేస్తున్నారు.
తొలి జాబితాలో అభ్యర్థులు వీరే
- సిర్పూర్ – డా.పాల్వ హరీష్ బాబు
- బెల్లంపల్లి (ఎస్సీ) – శ్రీమతి అమరాజుల శ్రీదేవి
- ఖానాపూర్(ఎస్టీ) – రమేష్ రాథోడ్
- ఆదిలాబాద్ – పాయల్ శంకర్
- బోధ్(ఎస్టీ) – సోయం బాబు రావు (ఎంపీ)
- నిర్మల్ – ఆలేటి మహేశ్వర్ రెడ్డి
- ముదోల్ – రామారావు పటేల్
- ఆర్మూర్ – పైడి రాకేష్ రెడ్డి
- జుక్కల్ (ఎస్సీ) – టీ. అరుణ తార
- కామారెడ్డి – కే. వెంకట రమణారెడ్డి
- నిజామాబాద్ అర్బన్ – ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
- బాల్కొండ – అన్నపూర్ణమ్మ ఆలేటి
- కోరుట్ల – ధర్మపురి అరవింద్ (ఎంపీ)
- జగిత్యాల – డా బోగా శ్రావణి
- ధర్మపురి (ఎస్సీ) – ఎస్ కుమార్
- రామగుండం – కందుల సంధ్యారాణి
- కరీంగనర్ – బండి సంజయ్ (ఎంపీ)
- చొప్పదండి (ఎస్సీ) – బొడిగే శోభ
- సిరిసిల్ల – రాణి రుద్రమ రెడ్డి
- మానకొండూర్ (ఎస్సీ) – ఆరేపల్లి మోహన్
- హుజురాబాద్ – ఈటెల రాజేందర్
- నార్సాపూర్ – ఎర్రగొళ్ల మురళీ యాదవ్
- పఠాన్‌చెరు – టీ.నందీశ్వర్ గౌడ్
- దుబ్బాక – రఘనందన్ రావు
- గజ్వేల్ – ఈటెల రాజేందర్
- కుత్భుల్లాపూర్ – కునా శ్రీశైలం గౌడ్
- ఇబ్రహింపట్నం – నోముల దయానంద్ గౌడ్
- మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్
- ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి
- కార్వాన్ – అమర్ సింగ్
- గోషామహల్ – టీ రాజాసింగ్
- చార్మినార్ – మేఘా రాణి
- చంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్
- యాకత్పురా – వీరేంద్ర యాదవ్
- బహ్దుర్‌పురా – వై. నరేష్ కుమార్
- కల్వకుర్తి – తల్లోజు ఆచార్య
- కొల్లాపూర్ – అల్లెని సుధాకర్ రావు
- నాగార్జున సాగర్ – కంకణాల నవనీత రెడ్డి
- సూర్యపేట – సంకినేని వెంకటేశ్వర్ రావు
- బోనగిరి – గూడూరు నారాయణ రెడ్డి
- తుంగతుర్తి (ఎస్సీ) – కడియం రామచంద్రయ్య
- జనగామ – డా.దశ్మంత్ రెడ్డి
- స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) – డా.గుండె విజయ రామారావు
- పాలకుర్తి – లేగా రామ్మోహన్ రెడ్డి
- డోర్నకల్ (ఎస్టీ) – భుక్యా సంగీత
- మహబుబాబాద్(ఎస్టీ) – జాతోత్ హుసేన్ నాయక్
- వరంగల్ పశ్చిమ – రావు పద్మ
- వరంగల్ తూర్పు – ఎర్రబెల్లి ప్రదీప్ రావు
- వర్ధన్నపేట (ఎస్సీ) – కొండేటి శ్రీధర్
- భూపాలపల్లి – చందుపట్ల కీర్తి రెడ్డి
- ఇల్లందు (ఎస్టీ) – రవీంద్ర నాయక్
- భద్రాచలం (ఎస్టీ) – కుంజా ధర్మారావు.
Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ