NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ లో గల్లీ నుండి ఢిల్లీ పెద్దలు..! బీజేపీ × టీఆరెస్ యుద్ధం షురూ..!!

 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ప్రతి నిమిషం ఉత్కంఠతో సాగుతోంది. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. గ్రేటర్ వార్ ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల తరుణంలో అధికార పార్టీ, భారతీయ జనతా పార్టీ ల మధ్య మాటల యుధం తారా స్థాయి కి చేరుకున్నాయి. ఇందులో భాగంగా, స్టార్‌ క్యాంపెయినర్లుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలను ప్రచార బరిలోకి దించి రోడ్ షోలు నిర్వ‌హించేలా బీజేపీ ప్ర‌ణాళిక ర‌చించింది.ఇప్పటికే ఆదివారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రచారం సాగించగా, సోమవారం బెంగళూరు ఎంపీ, బీజేపీ యూత్ వింగ్ అధ్యక్షుడు తేజస్వి సూర్య హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ వారంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచార బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

bjp trs

ప్రచారం లో భాగంగా భాజపా యూత్ వింగ్ అధ్యక్షుడు తేజస్వి సూర్య మాట్లాడుతూ.. “గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీతో జతకట్టిన ఎంఐఎం పార్టీ నేతలపై విరుచుక పడ్డారు. మహ్మద్ అలీ జిన్నా అవతారం అన్నీ పిలిచారు. ‘ఓవైసీ బ్రదర్స్ కు ఓటు వేస్తే దేశానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లే అని సంచలన కామెంట్స్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ, అతని సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరూ కలిసి విభజన, మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వీరు రోహింగ్య ముస్లింలను అనుమతించడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందడం లేదని విమర్శించారు. అతను (అసదుద్దీన్ ఒవైసి) జిన్నా క్రూరమైన ఇస్లామిజం, వేర్పాటువాదం,ఉగ్రవాదం యొక్క భాషను మాట్లాడుతాడు. ప్రతి భారతీయుడు ఒవైసీ సోదరుల విభజన మరియు మత రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడాలి. ఈ ఇస్లామీకరణ జరగడానికి మేము అనుమతించము, ఇది మా సంకల్పం అన్ని తేజ సూర్య అన్నారు. నేను అక్బరుద్దీన్ మరియు అసదుద్దీన్ ఒవైసీలకు చెప్పాలనుకుంటున్నాను, ఇది నిజాంల సమయం కాదు. ఇది హిందూ హ్రుదే సామ్రాట్ నరేంద్ర మోడీ సమయం”. మీరు ఇక్కడ ఏమీ ఉండరు అన్ని మత పరమైన వ్యాఖ్యలు చేసారు. డిసెంబర్ 1న జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలు ‘ నేడు హైదరాబాద్ మార్పుకోసం, రేపు తెలంగాణ మార్పుకోసం, ఎల్లుండి దక్షిణ భారతదేశం మార్పు కోసం ఉపయోగపడేలా ఉండాలన్నారు. అంతేకాకుండా, ఈ ఎన్నికలను దేశం మొత్తం చూస్తోందని ఓటర్లకు వివరించారు.

tejaswi surya

ఈ వ్యాఖ్యలపై కె కవిత స్పందిస్తూ, ఈ యువ నాయకుడు అని పిలవబడే అతను “హైదరాబాద్ను మార్చాలని, తెలంగాణను,దక్షిణ భారతదేశాన్ని మార్చాలని కోరుకుంటున్నాను. నేను అతనికి చెప్పాలనుకుంటున్నాను, బాస్, కళ్ళు తెరవండి, తెరాస ప్రభుత్వంలో హైదరాబాద్ ఇప్పటికే మారిపోయింది”. అమెజాన్, గూగుల్ హైదరాబాద్‌కు వచ్చాయి. 6 సంవత్సరాలలో, 24 గంటల్లో నాణ్యమైన విద్యుత్తు హైదరాబాద్‌కు వచ్చింది, మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అద్భుతమైన రహదారి,మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌ను సృష్టించాము, అన్ని తెలిపారు.

 

kavitha

ఇది ఇలా ఉంటె ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రవేశించబోయిన తేజస్వి సూర్యని ఎన్‌సీసీ గేట్ వద్ద భారీకేడ్స్ అడ్డం పెట్టి ఆపేందుకు పోలీసులు యత్నించారు.అంతేకాకుండా, తేజస్విని క్యాంపస్ లోనికి అనుమతించడం కుదరదని చెప్పారు. కొంత సమయం ఆ ప్రాంతం అంతా ఉద్రిక్త పరిస్థిలు నెలకొన్నాయి. పోలీస్ లు పెట్టిన బారికేడ్లను తొలగించి తేజస్వి సూర్య యూనివర్సిటీ లోకి తన సహచరులతో ప్రవేశించారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట నెలకొంది. అనంతరం ఎంపీ సూర్య కార్యకర్తలతో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం సమీపంలో సమావేశమయ్యారు.

 

sanjay bandi

మరో వైపు బండి సంజయ ప్రచారలో మాట్లాడుతూ, “గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ గెలిచాక, ఓల్డ్ సిటీ లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తాం అన్ని, రోహింగ్యలు తరిమివేస్తాము” అన్ని మత పరమైన వ్యాఖ్యలు చేసారు.ఏ మతాల పైన కెసిఆర్ స్పందిస్తూ మీకు ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా లేదా కర్ఫ్యూ, మతపరమైన అవాంతరాలు ఉన్న హైదరాబాద్ కావాలా?హైదరాబాద్ ప్రజలే ఎంపిక చేసుకోవాలి” అని ముఖ్యమంత్రి అన్నారు

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju