BJP Vs TRS: కేసిఆర్ పై పశ్చిమ బెంగాల్ స్ట్రాటజీ అమలు చేస్తున్న బీజేపీ..? ‘దీదీ’లా తట్టుకుంటారో లేదో..!?

Share

BJP Vs TRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ ఎత్తుగడలు మామూలుగా ఉండవు. మాటల మాంత్రికుడుగా ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేసి దాన్ని తన పార్టీ గెలుపునకు వాడుకోవడంలో దిట్ట. కేసిఆర్ కు ప్రత్యేకంగా రాజకీయ వ్యూహకర్తలు అవసరం ఉండదు. మూడున్నర దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవంతో ప్రత్యర్ధుల వ్యూహాలను చిత్తు చేసే అపర చాణిక్యుడుగా పేరుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే కేసిఆర్ చుక్కలు చూపించారు. ఆ పార్టీలోని నేతలను, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ గూటికి చేర్చుకుని కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడటంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ పుంజుకుంటోంది. రెండవ సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసిఆర్ సీఎం అయిన తరువాత ఆయన వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. స్వయంగా కేసిఆర్ కుమార్తె కవిత పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలవ్వడం పెద్ద మైనస్. దానికి తోడు గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుపు ఆ పార్టీలో జోష్ ని నింపాయి.

BJP Vs TRS telangana politics
BJP Vs TRS telangana politics

 

BJP Vs TRS: దుబ్బాక, హూజూరాబాద్ గెలుపుతో

కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి బీజేపీ పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాత ఆయన టీఆర్ఎస్ పార్టీపై, కేసిఆర్ పై మరింత దూకుడుగా వ్యవహరించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆశలు చిగురించాయి. కేసిఆర్ రెండవ సారి సీఎం అయిన తరువాత దుబ్బాక, నాగార్జునసాగర్, హూజూరాబాద్ ఉప ఎన్నికలు జరగ్గా నాగార్జునసాగర్ మినహా రెండు అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవశం చేసుకుంది. అంతకు ముందు కేవలం ఒక్క ఎమ్మెల్యే (రాజాసింగ్) మాత్రమే ఉండగా ఆ బలం మూడుకు చేరింది. అసెంబ్లీలో పెద్దగా బలం లేకపోయినా కేంద్రంలో ఉన్న అధికారం అండతో 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. కేంద్ర బీజేపీ కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు ప్రచారానికి వచ్చారంటే ఆ పార్టీ ఎంత ఎఫెక్ట్ పెడుతుందో అర్ధం చేసుకోవచ్చు. అంత దూకుడుగా వెళ్లడం వల్లనే గతంలో ఎన్నడూ లేని విధంగా 40కి పైగా డివిజన్ లను బీజేపీ కైవశం చేసుకుంది.

 

బీజేపీ వ్యూహాత్మక అడుగులు

తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును కేంద్ర బీజేపీ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కారణంగా నిన్న జరిగిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా పాల్గొని కేసిఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అమలు చేసిన వ్యూహాన్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేలా కనబడుతోంది. బీజేపీ అక్కడ సర్వశక్తులు వడ్డినా మమతా బెనర్జీ (దీదీ)ని అధికారం నుండి దింపలేకపోయారు. కాకపోతే మూడు స్థానాల నుండి 77 స్థానాలకు బీజేపీ ఎదిగింది. ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మమతా బెనర్జీనే ఆమె నియోజకవర్గంలో ఓడించి రికార్డు నమోదు చేసుకుంది బీజేపీ. ఇప్పుడు తెలంగాణలోనూ బీజేపీ అదే రకమైన ఫార్మలా అవలంబిస్తూ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్న నేపథ్యంలో దీదీ మాదిరి కేసిఆర్ తట్టుకుని నిలబడతారా లేదా అనేది ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.


Share

Related posts

ఇంజనీర్ కాబోయి సింగర్ గా మారిన బాలు..!!

Special Bureau

ఆచార్య.. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలన్ని సమ్మర్ టర్గెట్.. కరెక్ట్ కాదంటున్న విశ్లేషకులు ..?

GRK

పేరే కాదు! అంతా వెరైటీ నే!! ఎవరామె? ఏమిటా కథ??

Yandamuri