ఆర్ఎస్ఎస్ చీఫ్ కు ఎన్ఎస్‌జి భద్రత పెంపు!

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత పెంచాలని అధికారులు చెబుతున్నారు. తాజాగా జరిగిన సెక్యూరిటీ ఆడిట్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత పెంచాలని సిఫారసు చేశారు.

ఆయన భద్రతకు ముప్పు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రాణాలకు ముప్పు ఉందన్న ఇటీవలి ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అధికారులు ఈ మేరకు సిఫారసు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రముఖుల భద్రతపై కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు సమీక్ష నిర్వహించాయి. ఈ సమీక్షలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత పెంచాల్సిన అవసరం ఉందని నిఘా సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఆయనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కు చెందిన బ్లాక్ క్యాట్ కమెండోస్ తో భద్రత కల్పించాలని నిఘా సంస్థలు సిఫారసు చేశాయి.