NewsOrbit
న్యూస్

బ్లాస్టింగ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్లో సిబిఐ హడావిడి !

సిబిఐ పనితీరు బాగా తెలిసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షాలను కట్టడి చేయడానికి అదే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో సిబిఐ జెడి లక్ష్మీనారాయణ అక్రమాస్తుల కేసులో జగన్ కు సీబీఐ రుచి చూపించడం తెలిసిందే.ఆ సందర్భంగా జగన్ దాదాపు ఒకటిన్నర ఏడాది జైల్లో ఉండటం కూడా విదితమే.అయితే ఇదే సమయంలో జగన్ కి సిబిఐ అధికారాలు దాని దర్యాప్తు విధానం బాగా అవగతం అయిందంటారు.అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ సిబిఐని అన్నివిధాలా వాడుకోవటానికి సిధ్ధపడ్డారు.

Blasting News: CBI rush in Andhra Pradesh
Blasting News: CBI rush in Andhra Pradesh

అందుకే ప్రతి కేసును సీబీఐ కి ఇచ్చేందుకే ఏపీ ప్రభుత్వం ఇష్టపడుతుంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. సీబీఐ విచారణ అంటేనే ఎవరికైనా గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. వారి నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పే పరిస్థితి ఉండదు. జగన్ ఈ రకమైన ప్రశ్నలను గతంలో ఎదుర్కొన్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ లకు కూడా సీబీఐ రుచి చూపించాలని భావిస్తున్నట్లుంది.ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సీబీఐ కాలం నడుస్తోంది. తాజాగా అంతర్వేది రధం దగ్దంతో పాటు అమరావతి రాజధాని భూముల కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ లో జరిగిన అవినీతిపై సీబీఐకి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది. దీంతో సీబీఐ విచారణ కేసుల సంఖ్య ఏపీలో పెరిగిపోతున్నాయి.

ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సీబీఐ మంత్రం పఠిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతుంది.విచిత్రమేమిటంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో సిబిఐకి ప్రవేశం లేదంటూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు సిబిఐ జపం చేస్తున్నారు. దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమం కూడా చేశారు. మమతాబెనర్జీతో కలిసి ఒక ర్యాలీలో కూడా పాల్గొన్నారు.అప్పట్లో టిడిపి బిజెపితో తెగతెంపులు చేసుకోవడంతో కేంద్రం ఏమైనా సిబిఐ ద్వారా తమను ఇబ్బంది పెడుతుందేమో అన్న ఉద్దేశంతో చంద్రబాబు ఆ స్టాండ్ తీసుకున్నారు.అయితే చంద్రబాబులో ఇప్పుడు పరివర్తన ఎందుకొచ్చిందో సిబిఐని ఎందుకు విశ్వసిస్తున్నారో ఆయనకే తెలియాలి

ధర్నాలో కూడా పాల్గొన్నారు. కానీ చంద్రబాబు అయితే రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకే మందు అన్నట్లు బాబు కోరుకున్నట్లుగానే ఇప్పుడు అమరావతి, ఫైబర్ గ్రిడ్ లను కూడా జగన్ సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమయ్యారు.పైకి చంద్రబాబు గంభీరంగా కనిపిస్తున్నా ఆయన బ్యాచ్ మాత్రం సిబిఐ విచారణ అంటే లోలోన భయపడుతోందనది వాస్తవం.ఏదేమైనా రానున్న రోజుల్లో సిబిఐ సమయమంతా ఆంధ్రప్రదేశ్ కేసులతోనే సరిపోయే సూచనలు గోచరిస్తున్నాయి

author avatar
Yandamuri

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?