NewsOrbit
న్యూస్

‘తనిష్క్’ కు దెబ్బ మీద దెబ్బ!ఎవరేస్తున్నారబ్బా?

ప్రముఖ ఆభరణాల సంస్థ తనిష్క్ ఏ అడ్వర్టైజ్మెంట్ విడుదల చేసినా అది వివాదాస్పదం కావడం దాన్ని వెనక్కు తీసుకోవడం పరిపాటిగా మారింది.ఒక్క తనిష్క్ విషయంలోనే ఎందుకిలా జరుగుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

కొద్ది రోజుల క్రితం అ సంస్థ మతసామరస్యాన్ని బోధిస్తూ ఒక ప్రకటన విడుదల చేయగా అది నెటిజన్ల ఆగ్రహానికి గురికావడం తెలిసిందే.ఒక హిందూ కోడలు ముస్లిం కుటుంబం లో ప్రవేశించినప్పుడు ఆమెను ఆ కుటుంబం స్వాగతిస్తున్నట్లు ఆ ప్రకటన వెలువడింది.నిజానికి ప్రకటన ఉద్దేశం మంచిదే.రెండు మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో దీన్ని ఆ సంస్థ డిజైన్ చేసి ఉండొచ్చు.కానీ ఎందుకో ఇది హిందూవాదులకు నచ్చలేదు.దీనిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు.లవ్ జిహాద్ ని ఈ ప్రకటనల ద్వారా తనీష్కు సంస్థ ప్రమోట్ చేస్తోందని వారు మండిపడ్డారు. ట్విట్టర్ లో అయితే ‘బాయ్ కాట్ తనిష్క్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు.

వివాదం ముదరడంతో ఆ సంస్థ ఆ ప్రకటనను వెనక్కు తీసుకుంది.తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అదే సంస్థ మరో ప్రకటన విడుదల చేసింది.దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చరాదని.. కేవలం దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని తనిష్క్ తన యాడ్ లో చూపించింది. ఈ దీపావళి యాడ్ కూడా వివాదాస్పదమైంది. అందరికంటే ముందు కర్ణాటకకి చెందిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రవి ఈ ప్రకటనపై స్పందించారు. హిందువుల పండుగలను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే విషయాన్ని ఎందుకు చెబుతారు.

ఒక వర్గం సంస్కృతి సంప్రదాయాలపై లెక్చర్లు ఇవ్వకూడదని.. మీకేంటి నొప్పి.. దీపావళికి దీపాలు వెలిగిస్తాం.. స్వీట్లు పంచుతాం.. బాణాసంచా కాలుస్తాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.వెంటనే ఇతర నెటిజన్లు కూడా అంది పుచ్చుకొని ఆ సంస్థను తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు.మళ్లీ ‘బాయ్ కాట్ తనిష్క’అనేంత వరకు పరిస్థితి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన ఆ సంస్థ వెంటనే ఈ దీపావళి ప్రకటనను కూడా ఉపసంహరించుకుంది.అయినప్పటికీ నెటిజన్ల ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు.కాగా తమ పోటీ సంస్థలు ఈ విధంగా నెటిజన్లను రెచ్చగొట్టి తమ పైకి వదులుతున్నారని తనిష్క సంస్థ భావిస్తోందని సమాచారం.ఇప్పటికైతే ఇంకా ఈ వివాదం పూర్తిగా సద్దుమణగలేదు.ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!