బ్లూ టీ పౌడర్‌ను శంఖపుష్పం (Clitoria ternatea )అనే మొక్క పువ్వులను ఎండబెట్టి తయారు చేస్తారు. నిజానికి ఈ మొక్క మన చుట్టు ఉండే పరిసర ప్రాంతాల్లోనే కనిపిస్తుంది . ఈ పువ్వులను తీసి నీడలో ఎండబెట్టి పొడి గా చేసుకోవాలి.ఆ తర్వాత పొడిని కొంచెం నీటి లో వేసి బాగా మరిగించాలి.అలా మరిగించడం వలన డికాషన్ తయారవుతుంది. ఆ డికాషన్‌ని వడకట్టి రుచి కోసం అందులో కొంచెం నిమ్మరసం లేదా తేనెను కలుపుకుని తాగడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది.
కానీ వేడిగా ఉండగానే దీన్ని తాగాలి. అస్సలు ఈ బ్లూ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. బ్లూ టీ తాగడం వలన కాలేయ నికి సంబందించిన కొవ్వు సమస్యలు పరిష్కరించడం తో పాటు జీవక్రియ మెరుగయేలా చేస్తుంది. బ్లూ టీ లో ఉండే శక్తిమంతమైన టానిన్స్ మనం తీసుకున్న ఆహారం నుంచి ఐరన్‌ను సేకరిస్తుంది. అందుకే భోజనం చేయడానికి ఒక గంట ముందు లేదాచేసిన గంట తర్వాత కప్పు బ్లూ టీ తాగాలి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా బ్లూ టీ చక్కని ఔషదంగా చెప్పవచ్చు.
బ్లూ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంతోపాటు ఒత్తిడి తగ్గించే లక్షణాల ను కలిగి ఉంది. గ్లూకోజ్ మెటబాలిజం ను కంట్రోల్ చేసి టైప్-1 డయాబెటిస్‌ను బ్లూ టీ నిరోధిస్తుంది. గ్రీన్ టీ తో పోల్చుకుని చూస్తే బ్లూ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ అని వైద్య పరంగా నిరూపించబడింది. బ్లూ టీ తాగడం వల్ల చర్మ సమస్య లు తగ్గడం తో పాటు. చర్మం మృదువుగా తయారవుతుంది.
మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. బ్లూ టీ ని వేడి మినరల్ వాటర్‌తో తీసుకోవాలి. బ్లూ టీ ని మట్టితో చేసిన కప్పు లో తాగడం మంచిది. ఈ టీ మార్కెట్లో ‘ఊలాంగ్’,పేరుతో మరియు ‘బ్లాక్ డ్రాగన్ టీ’ పేరుతో అందుబాటులో కి వచ్చింది