Body heat foods: ఇప్పుడు అసలే చలికాలం. వాతావరణం చల్ల చల్లగా ఆహ్లాదకరంగా ఉండడంతో పాటుగా అనారోగ్యాలు కూడా త్వరగా వ్యాపిస్తాయి.ముఖ్యంగా దగ్గు, జలుబు గురించి అయితే చెప్పనవసరం లేదనుకోండి.అందుకె మన శరీరాన్ని వేడిగా మార్చడం చాలా ముఖ్యం.అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా. మీరు తినే ఆహారంలో మేము చెప్పే కొన్ని రకాల ఆహారపదార్ధాలను చేర్చుకోండి.అవి తినడం వలన మీ శరీరంలో వేడి ఉత్పన్నం అవుతుంది.మరి ఆ ఆహార పదార్ధాలు ఏంటో చూద్దామా.
ఉల్లిపాయలు :
ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే మనకు ఒక సామెత కూడా ఎప్పటినుంచో ప్రాచుర్యంలో ఉంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని.అలాగే ఈ చలికాలంలో ఉల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ఒంట్లో వేడి ఉత్పన్నం అవుతుంది
అల్లం :
అలాగే అల్లంలో కూడా చాలా రకాల ఔషదగుణాలు దాగి ఉన్నాయి.శరీరాన్ని వేడిగా ఉంచడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. అలాగే అల్లం తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా అధికం అవుతుంది.పచ్చి అల్లాన్ని వేడి నీళ్లలో వేసుకుని తీసుకుంటే చాలా మంచిది.అలాగే ప్రతి రోజు టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు కొద్దిగా అల్లం ముక్కను టీలో వేసుకుని తాగితే మరి మంచిది.
తేనె :
బెల్లం కూడా ఒంటిని వేడిగా మారుస్తుంది. అలాగే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.అలాగే తేనె కూడా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అలాగే చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలను తగ్గించంలో తేనె బాగా సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?