న్యూస్

పది రోజుల గాలింపు చర్యల తర్వాత..నిశాంత్ సింగ్ మృతదేహం లభ్యం

Share

 

 

మిగ్ -29కె పైలట్ నిశాంత్ సింగ్‌ చివరకు శవమై తేలాడు. నవంబర్ 26 న అరేబియా సముద్రంలో మిగ్ -29 కె ట్రైనర్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుండి నిశాంత్ మృతదేహం కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అయితే పది రోజులు తర్వాత మృతదేహం లభించింది.

 

nishanth singh

గత నెలలో మిగ్ -29 కె జెట్ నవంబర్ 26 న అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు కుప్పకూలింది. నవంబర్ 26వ తేదీన రష్యాకు చెందిన జెట్ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుండి బయలుదేరి నింగికెగిసిన మిగ్ 29 కే కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయి, తీరానికి కొద్ది దూరంలో సముద్రం లో కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో ఒక పైలెట్ ను సహాయ బృందాలు కాపాడగా, నిశాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతయ్యారు. అప్పటినుండి నిశాంత్ సింగ్ కోసం భారత నేవీ బృందాలు తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టింది .తప్పిపోయిన పైలట్‌ నిశాంత్ సింగ్ ను గుర్తించడం కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్‌లో భాగంగా భారత నావికాదళం తొమ్మిది యుద్ధనౌకలు, 14 విమానాలు మరియు అనేక ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్‌లను రంగంలోకి దింపింది.నవంబర్ 29 న, మిగ్ -29 కె విమానం యొక్క కొన్ని శిధిలాలను నావికాదళం స్వాధీనం చేసుకుంది, కాని అప్పుడు కమాండర్ నిశాంత్ సింగ్ యొక్క జాడ దొరకలేదు. ల్యాండింగ్ గేర్, టర్బోచార్జర్, ఫ్యూయల్ ట్యాంక్ ఇంజిన్ మరియు వింగ్ ఇంజిన్ కౌలింగ్‌తో సహా విమానం యొక్క కొన్ని శిధిలాలు మాత్రమే లభించాయని నేవీ పేర్కొంది. మిగ్ -29 కె యొక్క ప్రాధమిక శిధిలాల సమీపంలో ప్రత్యేక పరికరాలను ఉపయోగించి డైవర్స్ మరియు సీ బెడ్ మ్యాపింగ్ ద్వారా నీటి అడుగున శోధన కూడా చేపట్టబడింది.

MiG-29k

చివరికి సీబెడ్ కు 70 మీటర్ల లోతులో ఉండే నీటిలో ఆయన మృతదేహం లభ్యమైంది. గోవా కోస్ట్ కు 30 మైళ్ల దూరంలో ఆయన డెడ్ బాడీ దొరికింది. దాదాపు పది రోజుల పాటు గాలించి చివరకు ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం, అతని కుటుంబానికి సమాచారం అందించిన అధికారులు పోస్టుమార్టం నిమిత్తం నిశాంత్ సింగ్ మృతదేహాన్ని తరలించారు.

గ‌త ఏడాది కాలంలో మిగ్ విమానాలు ప్ర‌మాదానికి గురికావ‌డం ఇది మూడ‌వ‌సారి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో గోవా వ‌ద్ద ప‌క్షుల ఢీకొట్ట‌డంతో మిగ్ కూలింది. అయితే ఆ ప్ర‌మాద స‌మ‌యంలో ఇద్ద‌రు పైల‌ట్లు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో గోవా స‌మీపంలోనే ఓ మిగ్‌29కే కూలింది. అప్పుడు కూడా ఇద్ద‌రు పైల‌ట్లు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

 


Share

Related posts

ఆ దేశంలో ‘టిక్ టాక్’పై నిషేధం ఎత్తివేత!

Teja

బ్రేకింగ్ : భారత్ లో మొట్టమొదటిసారి ఒక సీఎం ను కాటేసిన కరోనా..!

arun kanna

Tirupati By Poll: హైకోర్టుకు చేరిన తిరుపతి పార్లమెంట్ బై పోల్ పంచాయతీ..

somaraju sharma