తిరుమల పోటులో పేలిన బాయిలర్ .. అయిదుగురు కార్మికులకు గాయాలు

 

(తిరుమల నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

తిరులమ శ్రీవారి ఆలయంలోని ప్రసాదాల తాయారు చేసే పోటులో తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పోటులో ఉన్న బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటులో ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమదం జరిగిన సమయంలో సుమారు 40 మంది కార్మికులు విదుల్లో ఉన్నట్లు సమాచారం.

పులిహోర ప్రసాదం తయారీ కోసం చింతపండు రసం వేడి చేస్తున్న సమయంలో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో అక్కడ ప్రసాదం తయారీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇంతకు ముందు బూందీ పోటులో చాలా సార్లు ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల నివారణకు టీటీడీ అధికారుుల జాగ్రత్తలు పాటిస్తున్నా తరచు ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తున్నది.