ట్రెండింగ్ న్యూస్

సల్మాన్ సోదరి చేసిన పనికి షాక్ అవుతారు..! రెస్టారెంట్ లో ప్లేట్లు విసిరికొట్టింది..!!

Share

 

 

ఇంట్లో చెయ్యిజారి తినే ప్లేట్ పడితేనే, ఎంతో అపశకునంగా భావిస్తాం. అయితే రెస్టారెంటు లో భోజనం చేసిన అనంతరం చేతికి అందిన ప్లేట్లను అందినట్లుగా నేలకేసి కొట్టారు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ శర్మ. ప్లేట్స్ విరగకొట్టాక, నృత్యం చేస్తూ తన స్నేహితులతో సంతోషంగా గడిపారు ఆమె.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అది ఏంటి సంతోషం తో ప్లేట్స్ విరగకొట్టడం ఏంటి అనుకుంటున్నారా..

 

bollywood actor salman khan sister arpita khan sharma

వివరాల్లోకి వెళ్తే సరదాగా గడిపేందుకు తన స్నేహితులతో కలిసి దుబాయ్ లోని రెస్టారెంటు కి వెళ్లారు అర్పిత ఖాన్. ఇక అప్పటికే అక్కడ ప్లేట్లు పగులకొట్టే కార్యక్రమం మొదలైంది. దీంతో అర్పిత కూడా అందులో భాగమయ్యారు. ఆ తర్వాత మ్యూజిక్‌ వింటూ అందుకు అనుగుణంగా స్టెప్పులేశారు. అయితే ఈ ప్లేట్ లు పగలకొట్టే ఆచారం గ్రీక్ దేశస్థులది. ఈ గ్రీకు ఆచారం ప్రకారం.. దుష్టశక్తులను పారద్రోలేందుకు ఇలా ప్లేట్లను పగులగొడుతూ ఉంటారు. అక్కడి వివాహ సంప్రదాయం లో ప్లేట్స్ వీరగకొట్టడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఇలా చేయడం ద్వారా దుష్ట శక్తులు దూరంగా ఉంటాయని,ఇరు కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా అనున్యంగా ఉంటారు అని, వారి మధ్య ఉన్న స్నేహ సంబంధాలు మరింత దృఢంగా ఉంటాయని అక్కడ వారి నమ్మకం. అదే నమ్మకాని పాటిస్తున్నారు దుబాయ్ లోని ఒక రెస్టారెంట్ సభ్యులు. తమకు తమ రెస్టారంట్ కి వచ్చిన వారికీ మధ్య స్నేహ సంబంధం కి సంకేతం గా ఇలా ప్లేట్స్ పగలకొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆ హోటల్ యాజమాన్యం.

 

aarpitha khan sharma breaking plates

అయితే రెస్టారంట్ లో ఈ వింత ఆచారాన్ని పాటించిన ఆమె, ఇంటికే వెళ్లగానే తన కొడుకు చేత కూడా ప్లేట్స్ ఇచ్చి పగలకోటిచ్చింది అర్పితా ఖాన్‌. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ తమ కుటుంబానికి సంబంధించిన అప్‌డేట్లు తెలియజేస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. అదే క్రమంలో ఈ రెండు వీడియోస్ ను పోస్ట్ చేసారు ఈమె.


Share

Related posts

AP Finance ministry: రూ.41వేల కోట్ల లేక్కల తేడా ఆరోపణపై ఏపి ఆర్ధిక శాఖ వివరణ ఇదీ..!!

Srinivas Manem

క‌రోనా ఎఫెక్ట్‌.. న‌లుపు రంగు క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌ను జ‌నాలు తెగ తింటున్నారు..!

Srikanth A

జ‌గ‌న్ మోదీ ఇద్ద‌రు ఒక్క‌టే

somaraju sharma