Bollywood: ప్రేమ గుడ్డిది అని ఓ నానుడి. అయితే ఎవరేమనుకున్నా మనుషులు మాత్రం ప్రేమను తమకు నచ్చినట్టు అన్వయించుకుంటూ, అదే ప్రేమ అని చెబుతూ వుంటారు. ఎంతైనా తెలివైన జీవులు కదా మరి. ఈ క్రమంలో పుట్టిందే ‘ప్రేమకు రెండు హృదయాలతో పని గాని, వయసుతో పనేంటి!’ అనే మాట. అవును.. ప్రేమలో మునిగి తేలుతున్న వారికి చుట్టూ ప్రపంచం తెలియని తెలియదు. ప్రేమికులు ఇలా రకరకాల మాటలు చెబుతూ, తమని తాము సమర్ధించుకుంటూ జీవితాన్ని వెళ్లబుచ్చుతారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇలాంటి ప్రేమలో పడటం సహజం. ఓ సారి వాళ్ళ లైఫ్ లోకి ఓసారి తొంగిచూస్తే!
Bollywood: భంగపాటులో బాలీవుడ్.. అక్కడి హీరోయిన్లను లాగేసుకుంటున్న టాలీవుడ్!
Bollywood: ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ జంటలు చెబుతున్నాయి:
మొదటగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాని తీసుకుంటే తనకన్నా 11 ఏళ్ల చిన్న వాడైన నిక్ జోనస్ ని ప్రేమ వివాహం చేసుకుంది. అసలు వయసుతో సంబంధం ఏమిటి అంటూ వీరు 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. మరో బాలీవుడ్ నటి అయినటువంటి అనుష్క శర్మ కూడా తనకంటే 6 నెలలు చిన్నవాడైన విరాట్ కొహ్లీని వరించి, పెళ్లి చేసుకుంది. ఓ కమర్షియల్ ప్రకటనలో ఇద్దరూ కలిసి నటించినప్పుడు స్నేహం కుదిరింది. అటుపై ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు పాటు డేటింగ్ అంటూ తిరిగిన జంట చివరికి పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
Bollywood- Tollywood: టాలీవుడ్ బాటపడుతున్న బాలీవుడ్ భామలు.. షాక్ లో బాలీవుడ్?
వీరి కథ కూడా చూడండి:
ఇక నమ్రత శిరోద్కర్ మన టాలీవుడ్ హీరో అయినటువంటి మహేష్ ని కూడా ఇలానే పెళ్లి చేసుకుంది. కాగా ఆయన భార్య అతనికంటే రెండేళ్లు పెద్దనే విషయం తెలిసినదే. అలాగే ఐశ్వర్యారాయ్ రాయ్ కంటే అభిషేక్ బచ్చన్ భార్య రెండేళ్లు చిన్నవాడు. అమృతా సింగ్ సైఫ్ అలీఖాన్ కంటే పదమూడేళ్లు పెద్ద. ఆ జంట కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం తనకంటే చాలా చిన్న వయసు ఉన్న కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది మరి.