Bollywood: అవును.. బాలీవుడ్ ప్రమాదంలో వుందని అక్కడ బడా బాబులు ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు చక్రం తిప్పిన బాలీవుడ్ ఇపుడు వెలవెలబోతోంది. ముఖ్యంగా సౌత్ సినిమాలంటే చాలా చులకన భావంతో వున్న బాలీవుడ్ బాబుల పాలిట `బాహుబలి` సింహస్వప్నం అయింది. రాజమౌళి ఒకేఒక్క సినిమాతో యావత్ ఇండియన్ సినిమాలోనే తెలుగు సత్తా ఏంటో రుజువు చూపాడు. దానితరువాత పరిస్థితులు బిన్నంగా తయారయ్యాయి. ప్రస్తుతం తెలుగు మార్కెట్ స్థాయి రికార్డు స్థాయికి చేరింది.
Tollywood: ఆ టాలీవుడ్ అందగాళ్ళు ఇప్పుడు కనిపించడంలేదు.. ఇప్పుడు వారు చేసే పనులు ఇవే!
Bollywood: బాలీవుడ్ భామలు టాలీవుడ్ బాట!
దాంతో ప్రతీ ఒక్కరూ టాలీవుడ్ వైపు చూడటం మొదలు పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ బామలు టాలీవుడ్ వైపు పయనమవుతున్నారు. రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్`తో అలియా ఇక్కడ తిష్ట వేసింది. ఇక ఇప్పటికే తెలుగులో కియారా అద్వానీ ఇప్పటి వరకు 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసినదే. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీలో కియారా చేస్తోంది. అలాగే అలియా భట్ ఇక్కడ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
Devatha Serial: ఆదిత్యకు దేవిని రాధ దగ్గర చేయనుందా.!? సత్య వలన ఆదిత్యకు మరో సమస్య..!?
అలియా చేస్తోన్న మరో సినిమా ఇదే:
ఎన్టీఆర్ 30వ చిత్రంగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో అలియా భట్ ని ఖరారు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తరువాత దీపికా పదుకునే తెలుగు హీరోలకు గాలం వేస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న `ప్రాజెక్ట్ కె`తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న దీపిక ఈ మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో నటించాలని వుందని ఇటీవల `గెహ్రైయాన్` మూవీ ప్రమోషన్స్ లో ఓ మీడియాతో మాట్లాడటం మనకు తెలిసినదే.