భారతదేశంలో ఎన్నో మతాలు కలిసిమెలిసి ఉంటాయి. జనాల మధ్య ఎంత బేధభావాలు ఉన్నప్పటికీ అందరూ బయట నుండి వచ్చే శక్తుల వల్ల ప్రభావితం అయి కొట్టుకొని చస్తారు తప్పించి మనుషుల మధ్య ఉండే అంతరం చాలా చిన్నది. అయితే బాలీవుడ్ లాంటి సినీ పరిశ్రమలో మాత్రం ఈ భేదభావాలు ఇప్పటికీ ఉన్నాయి అన్న విమర్శలు వస్తున్నాయి…
ఇంత కర్మ దేనికి…?
వివరాల్లోకి వెళితే బాలీవుడ్ ప్రముఖ బ్యానర్లలో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ వివాదంలో చిక్కుకుంది. నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆ సంస్థ తమ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిన పోస్టులు వివాదాస్పదం అయ్యాయి. వెంటనే పోస్టులను డిలీట్ చేసేసి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. నవరాత్రి ఉత్సవాల సమయంలో తమ పాలనలో ఆసక్తి పెంచడానికి వారు పెట్టిన ఫోటోలు, క్యాప్షన్ లు చాలా దారుణంగా ఉన్నాయి.
అవేం పోస్టులు రా బాబోయ్…?
ఒక పోస్ట్ లో కత్రినా కైఫ్ సెక్సీ ఫోటో పెట్టి డు “యు వాంట్ టు పుట్ మై రాత్రి ఇన్ నవరాత్రి” అని క్యాప్షన్ జోడించారు. అలాగే సల్మాన్ ఖాన్ ఫోటో పెట్టి “యు నీడ్ ఏ దాండి టు ప్లే దాండియా. ఐ హ్యావ్ వన్” అని.. రణ్ వీర్ సింగ్ పిక్ పెట్టి…. “లెట్స్ హావ్ సమ్ మజామా ఇన్ మై పైజామా” అనే క్యాప్షన్లతో కూడిన పోస్టులు పెట్టారు. హిందూ పండుగ దసరా మీద ఇలాంటి కౌంటర్ లు వేస్తూ పోస్టులు పెట్టడాన్ని నెటిజన్లు విపరీతంగా విమర్శించారు. రంజాన్ పండుగ సమయంలో మాత్రం పద్ధతిగా శుభాకాంక్షలు పెట్టి హిందూ పండుగ విషయంలో అన్యమతస్తుల ఫోటోలను అదికూడా సెలబ్రిటీల పిక్స్ కింద ఇలాంటి క్యాప్షన్స్ జతచేసి పరాచికాలు ఆడడం ఏమిటని మండిపడ్డారు. “బాయ్ కాట్ ఈరోస్” అంటూ నిన్నటి నుంచి ఒక పెద్ద ఉద్యమం నడుస్తోంది
బాయ్ కాట్ ఈరోస్
ఇక ఈ విషయానికి సెలబ్రిటీల కి దీనికి ఎలాంటి సంబంధం లేదని అర్థం అవుతోంది. ఈ మధ్య హిందుత్వ ఎజెండాతో దూకుడుగా వ్యవహరిస్తున్న కంగనారనౌత్ సైతం లైన్లోకి వచ్చింది. వారి తీరును తీవ్రంగా తప్పు పట్టింది. క్షమాపణలు చెప్పి ఎవరి మనోభావాలను దెబ్బ తీసి ఉంటే మన్నించాలని సదరు ఈరోస్ సంస్థ పేర్కొన్నప్పటికీ వారిపై ట్రోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.