Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీ కథ పై నమ్మకం కుదిరింది అంటే దాని కోసం ఎంత టైం, ఎన్ని సంవత్సరాలు అయినా కాల్ షిట్స్ ఇవ్వటంలో ముందుండే ఏకైక హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ విధంగానే ప్రభాస్ బాహుబలి కథ నమ్మి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు రాజమౌళికి కాల్షీట్స్ ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే మంచి స్టార్ హీరో అది బీభత్సమైన క్రేజ్ ఉన్న హీరో కథ కోసం ఈ విధంగా టైం కేటాయించారు అని ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సమయంలో చాలా మంది యాక్టర్లు తెలపడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే సినిమా కోసం టైం మాత్రమే కాక దెబ్బలు తగిలిన గాని.. దాన్ని కంప్లీట్ చేయడంలో ఎప్పుడూ ప్రభాస్ ముందు ఉంటారు. బాహుబలి సినిమా చేస్తున్న సమయంలో భుజానికి బలమైన గాయం తగిలిన మరోపక్క సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సూపర్ డూపర్ విజయాన్ని అందుకోవడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Read More: Prabhas: ప్రభాస్ చేయాల్సిన సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్..??
అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైములో ప్రభాస్ కాలి కి ఇటీవల కొద్ది నెలల క్రితం బలమైన గాయం జరిగిందట. అయినా కానీ కాలికి ఒకపక్క గాయమైన మరోపక్క.. సినిమా కంప్లీట్ చేయడానికి ప్రభాస్ ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరిగిందట. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు డైరెక్టర్లు ప్రభాస్ డెడికేషన్ లెవెల్స్ చూసి ఆశ్చర్య పోయారట. ఇటువంటి నటుడికి బాహుబలి వంటి బొమ్మ పడటం తప్పేం లేదు.. కష్టపడ్డా నటుడు కాబట్టి.. అటువంటి విజయాలు సాధిస్తున్నారు అంటూ తాజా వార్త పై బాలీవుడ్ వర్గాలు ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి అట.