Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్నాం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి పండుగకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇదే తరుణంలో సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన చిన్న పాటీ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. సరికొత్త మేకోవర్ తో మహేష్ బాబు గెటప్ తో పాటు స్లాంగ్ ఉంది.
ఇదే తరుణంలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఇన్నోసెంట్ రోల్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. బ్యాంకు రాబరీ తరహాలో సినిమా స్క్రిప్ట్ ఉన్నట్లు ఇప్పటికే వార్తలు రావడం మాత్రమే కాక.. రిలీజ్ అయిన వీడియో లో మహేష్ బాబు కూడా అదే తరహాలో.. మనీ కి సంబంధించి బ్యాంక్ అకౌంట్లో అన్న తరహాలో ఉన్నట్లు.. స్వదేశీ డబ్బును విదేశీ కరెన్సీ లో మార్చే క్యారెక్టర్ చేస్తున్నట్టు.. ఈ వీడియో చూసిన చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ నటిస్తున్నారట. సినిమాకి కీలకం గా ఈ క్యారెక్టర్ ఉంటుందని.. విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నట్లు.. చాలా స్టైలిష్ గా ఈ క్యారెక్టర్.. డైరెక్టర్ పరుశురాం తీర్చిదిద్దినట్లు సమాచారం.
మహేష్ బాబు వరుస బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత.. చేస్తున్న సినిమా కావడంతో సర్కార్ వారి పాట సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో జుట్టు బాగా పెంచుకోవడంతో పాటు మెడపై టాటూ తో మహేష్ లుక్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నట్లు వార్తలు రావడం తో మహేష్ అభిమానులు.. సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసుకున్నారు.