Bollywood: బాలీవుడ్ స్టార్లు రెమ్యునరేషన్ తో పాటు రెంట్లు కూడా భారీగా లాగుతున్నారట!

Share

Bollywood: సినిమా సెలిబ్రిటీల గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పని లేదు. వారి ఆదాయ వ్యయాల గురించి వారి మేనేజర్స్ ని అడిగితే చెబుతారు.. వారు ఏస్థాయిలో సంపాదిస్తారో.. ఏస్థాయిలో ఖర్చు పెడతారో అని. మనవాళ్లే ఆ రేంజ్ మెంటైన్ చేసినపుడు మన పొరుగున వున్న బాలీవుడ్ గురించి మనం ఇక ఊహించుకోవచ్చు. సినిమావాళ్లు చేతులనిండా దండిగా సంపాదిస్తారన్న విషయం తెలిసినదే. ఇటు సినిమాలతో పాటు వివిధ రకాల బిజినెస్ లతో కొంతమంది పెద్ద మొత్తాలలో సంపాదిస్తున్నారు.

New cars: కొత్తకారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ బెనిఫిట్ గురించి తెలుసుకోండి!
బాలీవుడ్ లో ఎవరెవరు.. ఎంతెంత సంపాదిస్తున్నారు?

బాలీవుడ్ స్టార్లు పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అవును… సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాలను వీరు రియల్ ఎస్టేట్‌ వైపు మళ్లిస్తున్నారు. దాంతో వారు భారీ స్థాయిలో అదనపు ఆదాయాలను ఆర్జిస్తున్నారు. కాగా.. రియల్ ఎస్టేట్ నుంచి బాలీవుడ్ స్టార్లకు వచ్చే ఆదాయాలు భారీగా ఉంటున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ‘దీపం వున్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే నానుడి వీరికి బాగా జీర్ణం అయినట్టుందని పలువురు వ్యాపార వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

Onion: అడిగి మరీ ఉల్లిపాయ తింటున్నారా..!? అయితే ఈ వ్యాధి వస్తుందట..!!
అత్యధికంగా సంపాదిస్తున్నది వీరే..

సల్మాన్‌ ఖాన్‌ ముంబైలో అద్దెకిచ్చిన తన అపార్ట్‌మెంట్‌ ద్వారా నెలకు రూ.95 వేలు సంపాదిస్తున్నారు. కాజోల్‌ ముంబైలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌ ద్వారా ప్రతి నెలా 90 వేల రూపాయలను ఆర్జిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లు నెలకు రూ.18.9 లక్షల చొప్పున రెంట్లు సంపాదిస్తున్నారు. ఇక బాంద్రాలో గల తన అపార్ట్‌మెంట్‌ ద్వారా సైఫ్ అలీ ఖాన్ నెలకు రూ.3.5 లక్షల వరకు లాగుతున్నాడు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయినటువంటి కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్‌ పేరుతో ఉన్న రెండు వాణిజ్య ఆస్తులను లీజ్‌కు ఇచ్చారు. వీటి అద్దె నెలకు సుమారుగా 24 లక్షలు రూపాయిలు.


Share

Related posts

The family man 2 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ మీదే సమంత బాలీవుడ్ ఎంట్రీ డిసైడయిందా..?

GRK

Sunitha: రామ్ వీరపనేని పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు!!

Naina

బందరులో దారణం.. ! వైసీపీ నేత కుమారుడు సజీవ దహనం..!!

Special Bureau