Bollywood: బాలీవుడ్‌లో పెళ్లికి క్యూ కట్టిన టాప్ సెలెబ్రిటీలు.. అన్నీ ప్రేమ వివాహాలే..!

Share

బాలీవుడ్‌ ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమి కాదు. ప్రస్తుతం అక్కడ హాలీవుడ్ కల్చర్ నడుస్తోందని చెప్పుకోవచ్చు. హీరోహీరోయిన్స్ మొదట డేటింగ్ చేశాక వర్కౌట్ అవుతుందనుకుంటే పెళ్లివరకు వెళ్తున్నారు. లేదంటే మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇంకొంత మంది ఏకంగా ‘లివింగ్ రిలేషన్’షిప్‌లో ఉంటూ పెళ్లి అవసరమా..? హ్యాపీగా ఇలా నచ్చినన్ని రోజులు ఉండి బోర్ కొట్టాక ఎవరి దారి వారు చూసుకుంటే కూడా బాగుంటుందనుకునే వారు సైతం లేకపోలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఎంటంటే మూడు నుంచి నాలుగు పదులు దాటిన హీరోయిన్స్ తమ భర్తలకు విడాకులు ఇచ్చి కుర్ర హీరోలతో డేటింగ్‌లో ఉన్నారు. వీళ్లు పెళ్లి చేసుకుంటారా? లేదా అనేది ఇప్పట్లో చెప్పడం కష్టమే..

పెళ్లి పీఠలెక్కబోతున్న లవ్ బర్డ్స్..

బాలీవుడ్‌లో ప్రస్తుతం వరుసగా పెళ్లిళ్లు జరగనున్నట్టు తెలుస్తోంది. అవన్నీ కూడా ప్రేమ వివాహాలే. ఇన్నిరోజులు కరోనా కారణంగా వీరంతా తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం పరిస్థితులన్నీ సర్దుమణగడంతో పెళ్లి పీఠలెక్కేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకుని తమ లవ్ లైఫ్‌కు శుభం కార్డు వేయాలనుకుంటున్నారని తెలిసింది. వీరిలో ప్రధానంగా ‘ఆలియా భట్ రణ్ బీర్ కపూర్’, ‘విక్కీ కౌశల్ కత్రీనా’లు ఉండగా, హాట్ హీరోయిన్ ‘సుతారియా ఆదార్ జైన్’ సీనియర్ల కంటే ముందే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట..

ప్రేమించుకున్నది చాలు.. ఇక పెళ్లే..

 

బాలీవుడ్‌లో చాలా మంది నటీనటులు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పబ్లిక్‌గా తిరగడాలు, ఫోటో షూట్స్, వెకేషన్స్ వెళ్లడాలు నడిచాయి. ఇక ఎన్నిరోజులు ఈ ప్రేమలు.. పెళ్లి చేసుకోవాలని పెద్దల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుండటంతో వీరు కూడా ఓకే చెప్పేసారట.. ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న రణ్ బీర్ ఆలియాతో లవ్ లో ఉన్నాడని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చివరకు తాము ప్రేమలో ఉన్నామని అంగీకరించారు. ఇక సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా చాలా మంది హీరోలతో డేటింగ్ చేసింది. చివరకు కుర్ర హీరో విక్కీ కౌశల్‌ను పెళ్ళి చేసుకునేందుకు ఓకే చెప్పిందని బీ టౌన్ వర్గాల్లో టాక్. ఈ ఇద్దరూ నటీనటులు తమ భాగస్వాములతో వచ్చే ఏడాది ప్రారంభంలో ఒక్కటయ్యేందుకు సిద్దంగా ఉన్నారని తెలిసింది


Share

Related posts

భారత్ కు చేరుతున్న అయిదు రఫెల్ యుద్ధ విమానాలు

somaraju sharma

అమరావతిపై తమ్మినేని సంచలన వ్యాఖ్య

somaraju sharma

టాస్‌తో విజయం

Siva Prasad