పాకిస్థాన్ : పెషావర్ లో బాంబు పేలుడు : 40 మందికి గాయాలు..!!

 

పాకిస్తాన్‌లో పెషావర్‌ పరిధి దిర్ కాలనీలోని మదర్సా శిక్షణ సంస్థలో మంగళవారం పేలుడు జరిగింది .మదర్సా వద్ద ఎవరో ఒక బ్యాగ్ వదిలిపెట్టిన కొద్ది నిమిషాల తరువాత బాంబు పేలిందని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ మన్సూర్ అమన్ సమాచారాన్ని తెలియచేసారు .పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ బాంబు పేలుడు మదర్సా ప్రధాన హాలులో ఇస్లాం బోధనల గురించి ఒక మతాధికారి ఉపన్యాసం ఇస్తుండగా బాంబు దాడి జరగడం వలన 40 మంది పిల్లలు గాయపడినట్లు తెలుస్తుంది .వీరిలో నలుగురి పరిస్థితి విషంగా ఉన్నట్లు మీడియా వెల్లడించింది,క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పెషావర్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పాకిస్తాన్ యొక్క ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతీయ రాజధాని.ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతీయ ప్రదేశం ఉగ్రవాద దాడులకు వేదికగా మారింది. ఈరోజు జరిగిన తరహాలోనే రెండు రోజుల కిందట కూడా క్వెట్టా నగరంలో జరిగింది, నాడూ ముగ్గురు మరణించారు. దీన్ని సెక్టారియన్ హింస (మత సంబంధ దాడి)గా పేర్కొంటున్నారు. దేశంలో శాంతి భద్రతలను పోగొట్టి, హింసని రేకెత్తించే ఇటివంటి దాడులు పాకిస్తాన్ లో తరచూ జరుగుతుంటాయి.