తమిళ స్టార్ హీరో అజిత్ ఇంటిలో బాంబు పెట్టారంటూ ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. దీనితో వెంటనే డాగ్ స్క్వాడ్ మరియు పోలీసులు హీరో అజిత్ ఇంటిని విపరీతంగా సోదా చేశారు.
స్నిఫ్ఫర్ డాగ్స్ ను తీసుకుని వెళ్ళినా కూడా వారికి ఏమి లభించలేదు. గతంలో కూడా తమిళ హీరోలు రజినీకాంత్, విజయ్ ఇళ్ళలో కూడా ఇలాగే బాంబు పెట్టినట్టు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అప్పుడు కూడా పోలీసులు వెంటనే అలర్ట్ అయి సోదాలు చేసిన ఘటనలు ఉన్నాయి.
అయితే ఈ ఫోన్ కాల్ తో అజిత్ కు సంబంధించిన ఆస్తుల పైన మరియు అతనికి చెందిన ఇళ్ళ పైన పోలీసులు నిఘా పెట్టనున్నారు మరియు ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.