ప్రస్తుతం బుల్లి తెరపై కామెడీ షోల హవా నడుస్తోంది. సగటు ప్రేక్షకుడు అల్టిమేట్ గా వినోదాన్నే కోరుకుంటున్నాడు. వినోదాన్నే ఆరాధిస్తున్నాడు. అందుకే కామెడీ షోలకు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. ఇతర భాషల్లోనూ బోలెడు కామెడీ షోలు బుల్లి తెరపై సందడి చేస్తున్నాయి. హిందీలో అయితే ఎక్కువగా ఫేమస్ అయింది కపిల్ కామెడీ షో. ఆ షోకు ఉన్న ఆదరణే వేరు. స్టాండ్ అఫ్ కామెడీ టైప్ లో కపిల్ ప్రేక్షకులను నవ్విస్తుంటాడు.
ఇక తెలుగులో చూసుకుంటే.. మొట్టమొదటి కామెడీ షో అంటే జబర్దస్త్ అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత చాలా చానెళ్లలో పలు రకాల కామెడీ షోలు వచ్చినా.. ఏవీ నిలబడలేదు. కానీ.. ఇటీవల జీ తెలుగులో వచ్చిన అదిరింది షో మాత్రం కాస్త జబర్దస్త్ కు పోటీ ఇస్తోంది. ఎందుకంటే.. అదిరింది షోలో ఉన్న టీమ్ లీడర్లు.. జబర్దస్త్ నుంచి వెళ్లిన వాళ్లే కాబట్టి.. అదే రకం కామెడీ అదిరింది షోలోనూ దొరుకుతుంది. అందులోనూ జబర్దస్త్ కు పనిచేసిన జడ్జి నాగబాబే.. అదిరిందికి కూడా జడ్జ్. దీంతో ప్రేక్షకులు ఈ షోను కూడా బాగానే ఆదరిస్తున్నారు.
అయితే.. ఇటీవల స్టార్ మా చానెల్ లో బిగ్ బాస్ ప్రారంభం అయింది. దీంతో కామెడీ షోలకు దెబ్బ పడింది. ప్రతి ఒక్కరు బిగ్ బాస్ షోనే చూస్తుండటంతో కామెడీ షోల టీఆర్పీ ఒక్కసారిగా పడిపోయిందట. ముఖ్యంగా శనివారం, ఆదివారం అయితే స్టార్ మా రేటింగ్ ఓ లేవల్ లో ఉంటోందట. దానికి కారణం బిగ్ బాస్.
అందుకే.. బిగ్ బాస్ షో నుంచి ప్రేక్షకులను కామెడీ షో వైపునకు తిప్పుకోవడం కోసం కామెడీ షోల్లో డోస్ ను పెంచుతున్నారు. తాజాగా అదిరింది షోను బొమ్మ అదిరిందిగా పేరు మార్చారు.
అంతే కాదు.. యాంకర్ శ్రీముఖిని ఇందులోకి దించారు. యాంకర్ సుమ, అలీ, జానీ మాస్టర్, నాగబాబు.. వీళ్లంతా కలిసి బొమ్మ అదిరింది షోలో సందడి చేయబోతున్నారు. ఇలాగైనా బిగ్ బాస్ అభిమానులు.. ఇటువైపు మళ్లుతారని ఆశ. ఏది ఏమైనా బొమ్మ అదిరింది షోలో కామెడీ డోస్ ను ఒక్కసారిగా పెంచేశారు.
ఈ ఆదివారం రాత్రి 9 గంటల నుంచే బొమ్మ అదిరింది పేరుతో కొత్త షోను తీసుకొస్తున్నారు జీ తెలుగులో. చూద్దాం.. మరి ఇప్పుడైనా బిగ్ బాస్ ను దాటుకొని బొమ్మ అదిరింది షో అదరగొడుతుందో లేదో. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో వీళ్ల రచ్చ మామూలుగా లేదు. మీరు చూడండి..
https://www.youtube.com/watch?v=Rz-io4Sj06M