NewsOrbit
న్యూస్

బ్యాంకు ఖాతాదారులకు బొనాంజా!ఇక 24గంటలూ ఆర్టీజీఎస్ సేవలు!!

ఆర్‌‌‌‌టీజీఎస్‌‌ సర్వీసులు ఇవాల్టి నుంచి 24 గంటల పాటు  అందుబాటులో వుంటాయి. డిసెంబర్ 14(సోమవారం) నుంచి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌‌మెంట్(ఆర్‌‌‌‌టీజీఎస్) సేవలు కొత్త దశలోకి ఎంటర్‌‌‌‌ అయినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఇవాళ రాత్రి 12.30 నుంచే ఈ సేవలు 24X7 అందుబాటులోకి వస్తాయని ముందస్తుగానే ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ట్వీట్ చేశారు. డిజిటల్ పేమెంట్లను మరింత పెంచేందుకు ఆర్‌‌‌‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. హై వాల్యు ట్రాన్సాక్షన్స్‌‌కు ఆర్‌‌‌‌టీజీఎస్ సిస్టమ్‌‌ను వాడతారు. ఇన్ని రోజులు ఇది కస్టమర్లకు అన్ని వర్కింగ్ డేస్‌‌లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు మాత్రమే పనిచేసేది. ప్రస్తుతం ఆర్‌‌‌‌టీజీఎస్ ట్రాన్సాక్షన్స్‌‌పై ఎలాంటి ఛార్జీలు లేవు. 2019 జూలై నుంచే ఈ ఛార్జీలను తీసేసింది. ఇక ఇప్పుడు ఎల్లవేళలా ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. దీంతో డిజిటల్ పేమెంట్స్‌‌కు మరింత జోష్ వస్తుందని బ్యాంకింగ్ వర్గాలంటున్నాయి. రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్‌‌ను జరపాలంటే ఆర్‌‌‌‌టీజీఎస్ ఫెసిలిటీని వాడాల్సి ఉంటుంది.

తక్కువ మొత్తాల కోసం ఇతర పేమెంట్స్ విధానాలు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌‌ఫర్(నెఫ్ట్), ఇమిడియేట్ పేమెంట్ సర్వీసు(ఐఎంపీఎస్), యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌ఫేస్(యూపీఐ) వంటివి వాడుకోవచ్చు. ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌‌కు పెద్ద మొత్తంలో ఫండ్స్ పంపించుకోవాలంటే సేఫ్ అండ్ సెక్యూర్ సిస్టమ్ మాత్రం ఆర్‌‌‌‌టీజీఎస్‌‌నే.మార్చి 2004లో ఆర్‌‌‌‌టీజీఎస్‌‌ను ఆర్‌‌‌‌బీఐ లాంచ్ చేసింది. ఈ పదహారేళ్లలో ఆర్‌‌‌‌టీజీఎస్ సిస్టమ్‌‌ను మరింత బలోపేతం చేసింది. ఎక్కువ మంది ఈ సిస్టమ్‌‌ను వాడేందుకు దీన్ని మరింత సెక్యూర్‌‌‌‌గా, కాస్ట్ ఎఫెక్టివ్‌‌గా మార్చింది. 2010లో ఆర్‌‌‌‌టీజీఎస్ ట్రాన్స్‌‌ఫర్లకు సంబంధించిన ఛార్జీలను తగ్గించింది.

గవర్నర్‌‌‌‌గా రఘురామ్ రాజన్ ఉన్నప్పుడు  ఆర్‌‌‌‌టీజీఎస్ ప్లాట్‌‌ఫామ్‌‌ను రెగ్యులేటరీ పూర్తిగా మార్చేసింది. గ్లోబల్ స్టాండర్డ్స్ ఐఎస్‌‌ఓ 20022కు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దింది. ఇక 2019లో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్‌‌‌‌బీఐ. బ్యాంక్‌‌లకు ఆర్‌‌‌‌టీజీఎస్ ప్లాట్‌‌ఫామ్ పూర్తిగా ఫ్రీగా  ఉంటుందని, ఈ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాలని ఆర్‌‌‌‌బీఐ ఆదేశించింది. ఈ నిర్ణయం చిన్న వ్యాపారులు సైతం ఈ ప్లాట్‌‌ఫామ్‌‌పైకి వచ్చేందుకు సహకరించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌‌‌‌టీజీఎస్ ద్వారా 15 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్‌‌ను మన బ్యాంకింగ్ సిస్టమ్‌‌ రికార్డు చేసింది. వీటి విలువ రూ.1,311 లక్షల కోట్లుగా ఉంది.

 

author avatar
Yandamuri

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N