Bone health: బంధారు చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. బంధారు చెట్టు కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పని ఉండదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా, కొండల్లో, గుట్టల్లో, పొలాల్లో విరివిగా ఈ చెట్టు లభ్యమవుతుంది. ఈ చెట్టు ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ ఎవరూ తెలియక వాడటం లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్టు గురించి తెలిసిన వాళ్లు వాడుతూనే ఉంటారు. ఈ చెట్టు ఆకుల నుండి రసం అయితే రాదు. కానీ ఈ చెట్టు ఆకులను తీసుకుని బాగా దంచి మోకాళ్ల నొప్పులు, వాపు ఉన్న వారు మోకాళ్లకు రెండు వైపులా ఉంచి గుడ్డతో గట్టిగా చుట్టేయాలి. ఇలా వారం పది రోజుల పాటు రోజు మోకాలికి కట్టినట్లైయితే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కొంత మందికి నొప్పులు తగ్గడానికి 15 రోజులు పట్టవచ్చు లేకపోతే నెల రోజుల్లో తగ్గవచ్చు. ఇక ఎముకలు చిట్లినా, విరిగిన వాళ్లు కూడా ఈ చెట్టు ఆకును వాడుతుంటారు.
ఎముకలు విరిగిన లేక చిట్లిన వారికి మరో పరిష్కారం ఏమిటి అంటే దంచిన ఈ ఆకులతో పాటు సున్నం రెండు స్పూన్ లు, చింత పండు రెండు స్పూన్ లు, కోడి గుడ్డు సొన మొత్తం కలిపితే పేస్ట్ లా అవుతుంది. ఆ పేస్టును మోకాలు గానీ మోచేయి లాంటి విరిగిన ప్రదేశంలో రాసి గట్టిగా కట్టుకడితే విరిగిన ఎముకలు అతుక్కుంటాయని చెబుతుంటారు. అయితే ఈ కట్టు ను రెండు రోజులకు ఒక సారి మార్చాల్సి ఉంటుంది. దీని వల్ల తక్కువ రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుంది.
ఇక ఈ చెట్టు వేళ్లు ను నీటిలో ఉడికించి ఆ నీళ్లను రోజు పుక్కిలించి ఉమ్మివేయడం వల్ల పళ్లు గట్టిపడతాయట. పళ్లు ఊడిపోయే ముసలి వాళ్లు ఈ నీటిని రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు. ఈ చెట్టు వేళ్లు తీయడం కష్టమైతే చెట్టు కాండం అయితే తీసుకుని ఉడికించి వాడవచ్చు. అదే విధంగా నోటిలో పుండ్లు ఉన్నా ఇది తగ్గిస్తుంది. అంతే కాకుండా ఈ చెట్టు బెరడును కట్ చేసి ఎండ బెట్టి ఆ తరువాత దాన్ని పొడి చేసి రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే ఎముకలు దృఢంగా, గట్టిగా మారతాయని పేర్కొంటున్నారు.