NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

భారీ స్కాం?! బొత్స, విజ‌య‌సాయి క‌లిసి ఏం చేస్తున్నారంటే…

విశాఖ‌ప‌ట్ట‌ణంలో కార్య‌నిర్వాహ‌క రాజ‌ధాని ఏర్పాటుకు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకోగా, వివిధ కోర్టు కేసుల కార‌ణంగా ఆ నిర్ణ‌యం ప్ర‌స్తుతానికి ఆగిపోయింది.

అయితే, ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై వైసీపీని టార్గెట్ చేసేలా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది. అయితే, ఇదే ఒర‌వ‌డిలో తాజాగా మ‌రో సంచ‌ల‌న విమ‌ర్శ చేసింది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

అంతా విజ‌య‌సాయిరెడ్డి ద్వారానే

ఉత్తరాంధ్రలో మంత్రులను పక్కనపెట్టి, విజయసాయిరెడ్డే సర్వం తానై వ్యవహరిస్తున్నార‌ని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలో ఉన్నవారికి ఇళ్ల పట్టాలుఇవ్వాలని 1400 ఎకరాలు సేకరించారు. ఆ భూమి మొత్తం కొండలు, గుట్టలు, లోతట్టుప్రాంతాల్లోనే ఉంది. సదరుభూమి చదునుకోసం రూ.23కోట్లను ప్రభుత్వం మంజూరుచేస్తే, ఆ సొమ్ముతో చేసే పనులకు ఎటువంటి టెండర్లు పిలవకుండా, మంత్రులు బొత్స, అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డి తమ వాళ్లకు పనులను కట్టబెట్టారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, రూ.23కోట్ల పనులను తమ అనుమాయులకు కట్టబెట్టేసి, ఏవిధమైన పనులు చేయకుండానే, ఆ సొమ్మంతా కాజేశారు. రూ.23కోట్లకు సంబంధించిన పనుల వ్యవహారంపై, నిధులు డ్రాచేయడంపై తక్షణమే ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఏ విచారణ జరిపిస్తారో జరిపించి నిజాలు బయటపెట్టాలి. “ అని డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా విజ‌యసాయిరెడ్డి సుమారు 6 నుంచి 7వేల ఎకరాల వరకు దోపిడీ చేశారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. “భూ ఆక్ర‌మ‌ణ‌ల‌పై తూతూ మంత్రంగా సిట్ వేసిన ప్రభుత్వం, దానికి సంబంధించిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు?` అని ప్ర‌శ్నించారు.

బొత్స రిప్లై మామూలుగా లేదుగా

అయితే, ఏపీ మంత్రి బొత్సా స‌త్యనారాయ‌ణ టీడీపీ విమ‌ర్శ‌ల‌కు ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. విశాఖలో జరిగిన ల్యాండ్ స్కాంలపై ఇప్పటికే సిట్ విచారణ జరుపుతోంద‌ని వెల్ల‌డించారు.“గత ప్రభుత్వం సిట్ విచారణను మూలన పెడితే.. ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని పున‌ర్ నిర్వ‌చించాం. నిర్దిష్ట సమయం ఇచ్చి విచారణ పూర్తి చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. సిట్ కాల పరిమితి ఇక పెంచకుండా దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పారు. మేం ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టే, ధైర్యంగా ఉన్నాం. విచారణ జరిపిస్తున్నాం. తెలుగుదేశం హయాంలో ఎప్పుడైనా ఏ దర్యాప్తు అయినా పూర్తి చేశారా..?  దోషులపై చర్యలు తీసుకున్నారా..? నాడు ప్రతిదీ ప్రతిపక్షంగా ఉన్న వైయస్ఆర్సీపీపై ఆరోపణలు మోపి.. దర్యాప్తులు వేసి, చివరికి వాళ్ళే దోషులుగా తేలేటప్పటికీ విచారణలు నిలిపివేశారు“ అంటూ విరుచుకుప‌డ్డారు.

విశాఖ కోసం ఏం చేస్తున్నామంటే…

పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖ నగర అభివృద్ధికోసం అన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నామ‌ని మంత్రి బొత్స వెల్ల‌డించారు. “విశాఖపట్నంలో కొత్తగా నిర్మించాల్సిన ప్రాజెక్టులను పరిశీలిస్తున్నాం.  భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించి ఓ ఏజెన్సీకి 2500 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో అప్పగించాలని చూస్తే.. అందులో 500 ఎకరాలు తగ్గించి, ఆ భూముల్లో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు పెంచాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే, టీడీపీ హయాంలో జరిగినట్టు ఎటువంటి దొంగ బుద్ధి లేదు. “ అంటూ మండిప‌డ్డారు.

author avatar
sridhar

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!