NewsOrbit
న్యూస్

వారం తర్వాత బయట పడిన బొత్స అమరావతి పర్యటన రహస్యం! వారినీ…అందుకా అంత హడావుడి?

అమరావతిలో ఏమీ లేదు.. మొత్తం గ్రాఫిక్సేనని .. స్మశానం అని… ఎడారి అని.. విమర్శలు గుప్పించిన సీఆర్డీఏ మంత్రి బొత్స సత్యనారాయణ… వాటిని రెండు రోజుల పాటు పరిశీలించారు. ఇంకా కొంత మిగిలిపోతే.. మళ్లీ వస్తానని అధికారులకు చెప్పారు. ఈ హడావుడి చూసి.. అమరావతి విషయంలో మనసు మార్చుకున్నారేమో అని చాలా మంది అనుకోవడం ప్రారంభించారు.

 

కానీ.. ఇప్పుడిప్పుడే సీఆర్డీఏ వర్గాలు ఓ కొత్త విషయాన్ని చెబుతున్నాయి. ఏమింటంటే.. అక్కడ నిర్మించిన భవనాలను అమ్మేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందట. ఆ టవర్లన్నీ అమ్మే సన్నాహాల్లోనే బొత్స పర్యటన సాగి౦దట. అమరావతిలో గత ప్రభుత్వం మంత్రులు, శాసనసభ్యులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాసాల కోసం భారీ రెసిడెన్షియల్‌ టవర్లను నిర్మించింది. ఒక్కొక్కటి 12 అంతస్తులతో కూడిన సుమారు 63 రెసిడెన్షియల్‌ టవర్లు నిర్మాణం చివరి దశలో ఉన్నాయి.

వీటన్నింట్లో కలిపి సుమారు 4,200లకుపైగా ఫ్లాట్లు ఉంటాయి. మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్‌ సర్వీస్‌ అధికారుల కోసం 180 బంగళాల నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం చేపట్టింది. వీటిలో అత్యధికం 80 శాతంమేర పూర్తయ్యాయి. ఏడాది నుంచి పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడే ప్రభుత్వంలో కదలిక కనిపిస్తోంది. తక్కువ ధరకైనా తెగనమ్మాలనే సీఆర్డీఏకి సూచనలు ఆ౦దాయట.రాజధాని భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు… కట్టిన టవర్లను పూర్తి చేసి.. రియల్ ఎస్టేట్ తరహాలో అమ్మేడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయమని సీఆర్డీఏ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. భవనాల పూర్తికి ఇంకెంత ఖర్చు అవుతుంది.. అమ్మేస్తే ఎంత ఆదాయం వస్తుందో.. సీఆర్డీఏ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మూడు వేల కోట్ల వరకూ ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెట్ ధర కన్నా… 20 శాతం తక్కువ ధర నిర్ణయిస్తే.. డిమాండ్ బాగుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.ఆయితే టిడిపి హయా౦లో అమరావతిలో… ప్రజల కోసం హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్‌ను సీఆర్డీఏ చేపట్టింది.

ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లు అన్నీ ప్రాజెక్ట్ ప్రారంభించిన రోజునే అయిపోయాయి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ కొనుగోలు దారుల్లో ఒక్కంటే.. ఒక్కరు కూడా.. తమకు ఇప్పుడు ఫ్లాట్ కావాలని అడగడం లేదు. ప్రభుత్వం రాజధానిని మార్చాలని నిర్ణయించుకోవడమే దీనికి కారణం. కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. కానీ.. ఏపీ సర్కార్ ఆ ప్రాజెక్టుకూ రివర్స్ టెండర్లు పిలిచింది. డబ్బులు కట్టిన వాళ్లే అక్కడ వద్దని వెనక్కి పోతూంటే… కొత్తగా డిమాండ్ వస్తుందని ప్రభుత్వం మాత్రం ఆశల పల్లకీలో ఉంది. ఎవరి లెక్కలు వారివి మరి!

author avatar
Yandamuri

Related posts

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N