కాలం మారుతున్న కొద్ది అనేక విషయాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా మనం చూసే చాలా అంశాలు నేడు విరుద్ధంగానూ.,. భిన్నమైన మార్పులకు గురయ్యాయి. వాటిలో సినిమా రంగం కూడా ఒకటి. ఎందుకంటే ఇదివరకూ సినిమాల్లోకి వచ్చిన చాలా మంది తాము మొదట ఎంచుకున్న పాత్రలు చేయడానికే మొగ్గు చూపేవారు. అంటే కామెడియన్లు.. కమెడియన్లుగా, హీరోలు, విలన్లు వారి వారి పాత్రలనే ఎంచుకుని తమ కెరియర్ను కొనసాగించేవారు. అయితే, కొన్నితప్పని పరిస్థితుల్లో హీరోలు విలన్లుగా.. విలన్లు హీరోలుగా మారిన ఘటనలు చాలానే కనిపిస్తాయి సినీ పరిశ్రమలో.. !
కానీ నేడు చిత్ర పరిశ్రమను గమనిస్తే.. పరిస్థితులతో పట్టింపులు లేకుండా అందరూ కూడా తమ హోదాను పక్కన బెట్టి అన్ని రకాల పాత్రల్లోనూ నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా పలువురు నటులు ప్రేక్షకుల ముందు హీరోలుగా కనిపించి.. ప్రస్తుతం విలన్లుగా మారినవారు చాలా మందే ఉన్నారు. అయితే, హీరోలుగా సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. ప్రస్తుతం తన సినిమాల్లో విలన్లుగా మారుస్తున్న దర్శకులలో ముందువరుసలో కనిపించే వారిలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను ముందుంటారు.
బోయపాటి సినిమా అనగానే యాక్షన్‌కు పెట్టింది పేరు. మాస్ అభిమానుల్లో ఆయన సినిమాలు వస్తున్నాయంటే సందడి మాములుగా ఉండదు. అయితే, ఆయన తన సినిమాల్లో ఇప్పటికే పలువురు హీరోలను.. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ హీరోలను సైతం విలన్లుగా మార్చి వారి కెరియర్ను మరింత దూసుకుపోయే విధంగా చేశారు. వారిలో ఒకరు హీరో జగపతి బాబు. ఆయన సినీ ప్రస్థానం ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో విలన్ గా మార్చి ఆయనకు మంచి పేరును తీసుకు వచ్చారు. హీరో కంటే విలన్‌గానే అధికంగా ప్రేక్షలకును మెప్పించారు జగపతి బాబు.
హీరో బాలయ్య సినిమాలో జగపతి బాబును, అల్లు అర్జున్ సినిమాలో ఆది పినిశెట్టిలను పవర్‌పుల్ విలన్లుగా మార్చి వారి కెరియర్‌కు మంచి బ్రెక్ ఇచ్చారు బోయపాటి. అలాగే రామ్ చరణ్ చిత్రం వినయ విధేయ రామలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్‌ని సైతం విలన్ గా చూపించారు. బాలయ్యతో వరుస సినిమాలు చేస్తున్న ఆయన ప్రస్తుతం మరో చిత్రం తీయబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆ సినిమాలో విలన్ కు సంబంధించి చాలా రకాల పుకార్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. అందులో టాలీవుడ్ ఫ్యామిలీ హీరో, సొట్టబుగ్గల అందగాడు శ్రీకాంత్‌ను విలన్‌గా నటించనున్నారని సమాచారం. మొదట సోనూసుద్ ని విలన్‌గా అనుకున్నారట.. అయితే, సోనూ రెమ్యూనరేషన్‌ను భారీగా డిమాండ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!