Boyapati srinu: ‘అఖండ’ సినిమా విషయంలో ఒక్క మాట మాట్లాడనన్న బోయపాటి ..ఎందుకలా అన్నారంటే..!

Share

Boyapati srinu: దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బోయపాటి సినిమా అంటే కొందరూ రక రకాల కామెంట్స్ చేస్తుంటారు. అది సినిమా విషయంలో కాదు. సినిమా మేకింగ్ సమయంలో ఆయన ప్రవర్తించే విధానం గురించి. సినిమా లైట్స్.. టైటిల్స్ కంటే ముందు స్టార్ కెమెరా..అండ్ యాక్షన్..అంటూ ఆయనే కనిపిస్తుంటాడు. దీని మీద ఇప్పటికే రక రకాల కామెంట్స్ కూడా ఇప్పటికే చాలా సార్లు చేసినవారున్నారు. ఇక బోయపాటి దర్శకత్వం వహించిన గత చిత్రం వినయ విధేయ రామ ఫ్లాప్ సినిమాగా మిగిలింది.

boyapati-srinu-commented about Akhanda movie
boyapati-srinu-commented about Akhanda movie

అయితే ఈ సినిమా విషయంలో బోయపాటి శ్రీను చాలా నమ్మకంగా ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ ఇవ్వబోతున్నానని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా గొప్పగా చెప్పారు. దాంతో మెగా అభిమానులు బోయపాటి మాటలకు వినయ విధేయ రామ సినిమా సక్సెస్ మీద ఊహించని విధంగా నమ్మకాలు పెట్టేసుకున్నారు. కేవలం మెగా అభిమానులే కాదు మెగాస్టార్‌తో మెగా ఫ్యామిలీ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ బోయపాటి చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా వినయ విధేయ రామ రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ ప్రతీ ఒక్కరికీ గట్టి షాకిచ్చింది. ఎంత చెప్పాడు..అంతలో సగం కూడా లేదు అనే కామెంట్స్ విసిరిన వారూ ఉన్నారు.

Boyapati srinu: అంతకు మించి ఎక్కువగా మాట్లాడటం లేదు.

అందుకే ఇప్పుడు బాలకృష్ణతో తీసిన అఖండ సినిమా గురించి ఇప్పుడు ఏమీ మాట్లాడనని ..సినిమా రిజల్ట్ తర్వాతే మాట్లాడతానని బోయపాటి ఇటీవల చెప్పుకొచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ కూడా సినిమా పెద్ద హిట్ అని చెబుతున్నాడు గానీ..అంతకు మించి ఎక్కువగా మాట్లాడటం లేదు. అంటే ఖచ్చితంగా బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా అఖండ గ్యారెంటీగా అఖండ విజయాన్ని అందుకుంటుందని నందమూరి అభిమానులు నమ్ముతున్నారు. చూడాలి మరి డిసెంబర్ 2న భారీగా రిలీజ్ కాబోతున్న అఖండ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్ – పూర్ణ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.


Share

Related posts

RGV: రామ్ గోపాల్ వర్మ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ బ్యూటీ..!!

sekhar

Ganta srinivasa Rao : బిగ్ బ్రేకింగ్ : వైసీపీలోకి గంటా ? స్ట్రాంగ్ సాక్షం ఇదే?

somaraju sharma

Vijayawada News: విజయవాడలో మరో ఘోరం.. నడిరోడ్డుపై పసికందుకి చీమలు కుట్టి తీవ్ర గాయాలు..!!

Srinivas Manem