Boyapati srinu: ఫస్ట్ డే హిట్ టాక్ తెచ్చుకున్నా..నెక్స్ట్ డే చరణ్ సినిమాకి ఫ్లాప్ టాక్ రాగానే వాల్లంతా బోయపాటిని లైట్ తీసుకోమన్నారా..?

Share

Boyapati srinu: టాలీవుడ్‌లో అగ్ర దర్శకులలో ఒకరు బోయపాటి శ్రీను. అగ్ర దర్శకుడు, రచయిత, నిర్మాత పోసాని కృష్ణమురళి స్కూల్ నుంచి వచ్చిన బోయపాటి శ్రీను దిల్ రాజు బ్యానర్ ద్వారా టాలీవుడ్‌లో దర్శకుడిగా మారాడు. మాస్ మారాజ రవితేజతో భద్ర సినిమాను తీసి ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించడంతో యాక్షన్ సినిమాలను బోయపాటి బాగా డీల్ చేస్తాడనే టాక్ వచ్చింది. దాంతో ఇండస్ట్రీలో అగ్ర హీరోలు, అగ్ర నిర్మాతల దృష్ఠి బోయపాటి శ్రీను మీద పడింది.

boyapati-srinu-vinaya-vidheya-rama-is-not-upto-the-expectations
boyapati-srinu-vinaya-vidheya-rama-is-not-upto-the-expectations

దాంతో ఆయనతో సినిమా నిర్మించేందుకు నిర్మాతలు, నటించేందుకు హీరోలు ఆసక్తి చూపించారు. దాంతో ఆయన నెక్స్ట్ సినిమాను విక్టరీ వెంకటేశ్‌తో తెరకెక్కించే అవకాశాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తులసి. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కూడా భారీ హిట్ అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు మాస్ హిట్స్ కావడంతో మూడవ సినిమా బాలయ్యతో తీసి భారీ హిట్ కొట్టాడు బోయపాటి. ఆ సినిమా బాలయ్య కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా. అప్పటి వరకు భారీ సక్సెస్‌లు లేని బాలయ్య బోయపాటి తెరకెక్కించిన సింహ సినిమాతో అఖండ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది.

ఆ తర్వాత యంగ్ టైగర్‌తో చేసే అవకాశం అందుకున్నాడు. ఆ సినిమానే దమ్ము. కథలో కొన్ని లోపాల వల్ల సినిమా జనాలకి అంతగా నచ్చలేదు. దాంతో కసితో నెక్స్ట్ సినిమాను మళ్ళీ బాలయ్యతోనే తీసి మరో భారీ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. బాలయ్య – బోయపాటి కెరీర్‌లో కూడా టాప్ టెన్‌లో నిలిచే సినిమాగా భారీ విజయాన్ని అందుకుంది. అదే లెజెండ్. లెజెండ్‌లో బాలయ్యను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించిన బోయపాటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఈ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమాను తెరకెక్కించి భారీ హిట్ ఇచ్చాడు. సరైనోడు సినిమా టీజర్, ట్రైలర్‌తోనే భారీ అంచనాలు పెంచిన బోయపాటి తన మార్క్ యాక్షన్ డ్రామాతో సాలీడ్ హిట్ ఇచ్చాడు బన్నీకి. ఇందులో అల్లు అర్జున్‌ని ఎంత పవర్‌ఫుల్‌గా చూపించాడో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్‌కి మంచి మాస్ హిట్ ఇవ్వడంతో నెక్స్ట్ సినిమాను మెగా పవర్ స్టార్ రాం చరణ్‌తో తీసే అవకాశం అందుకున్నాడు.

ఆ సినిమానే వినయ విధేయ రామ. కానీ ఈ సినిమా ఫస్ట్ డే హిట్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత రోజు నుంచి రివర్స్‌లో యావరేజ్, ఫ్లాప్ అనే టాక్స్ వచ్చాయి. ఫైనల్‌గా సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దాంతో చరణ్ అకౌంట్‌లో ఫ్లాప్ పడింది. ఇది మెగా అభిమానులను బాగా డిసప్పాయింట్ చేసింది. అందుకే బోయపాటి మళ్ళీ అవకాశం అందుకోవడానికి కాస్త సమయం పట్టింది.

ఇక బాలయ్యకి ఇటీవల కాలంలో హిట్ దక్కలేదు. దాంతో ఇప్పుడు ఇద్దరు కలిసి మాస్ హిట్ దక్కించుకోవాలని కసితో అఖండ సినిమా చేస్తున్నారు. మరోసారి బాలయ్యను డ్యూయల్ రోల్‌లో చూపిస్తున్నాడు. ఇప్పటికే అఖండ టీజర్, ట్రైలర్‌తో మంచి అంచనాలు పెంచాడు బోయపాటి. కేవలం నందమూరి అభిమానుల్లోనే కాకుండా కామన్ ఆడియన్స్‌లో కూడా అఖండ మీద భారీగా అంచనాలు పెరిగాయి. చూడాలి మరి బాలయ్య – బోయపాటి శ్రీనుల అఖండ హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందో లేదో.


Share

Related posts

Today Horoscope నవంబర్ 10th మంగళవారం రాశి ఫలాలు

Sree matha

EPFO : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు హెచ్చరిక.. ఆ తేదీని అప్డేట్ చేయకపోతే మీ పీఎఫ్ డబ్బులు గల్లంతు..

bharani jella

ఏపీలో ఇలా ..!తెలంగాణాలో అలా …!గులాబీ నేతల సైలెన్స్ దేనికి సంకేతం?

Yandamuri