NewsOrbit
న్యూస్ హెల్త్

Suicide: ఈ వ్యాది ఉండడం వలన కూడా ఆత్మహత్య  చేసుకోవాలనిపిస్తుందట??

Suicide: ఈ వ్యాది ఉండడం వలన కూడా ఆత్మహత్య  చేసుకోవాలనిపిస్తుందట??

Suicide: ఒక వ్య‌క్తి  ఆత్మహత్యకు Suicide ప్రేరేపించే కార‌ణాలు ఎన్నో ఉండొచ్చు. వాటిల్లో మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్య‌లు ముందు వ‌రుస‌లో ఉంటాయి అనే చెప్పాలి . ఇలాంటి కోవ‌కు చెందిందే బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ). బీపీడీ వ్యాధి ల‌క్ష‌ణాలేంటి, దీని బారిన ప‌డిన వారిని ఎలా ర‌క్షించుకోగలమో తెలుసుకుందాం. బీపీడీ అనేది మూడ్ స్వింగ్స్‌, ప్రవర్తనాప‌ర‌మైన లోపాలు ఉన్న‌వారిని మరింత  ప్ర‌భావితం చేస్తుంది. బీపీడీ ఉన్నవారు తీవ్ర‌ భావోద్వేగాలకు గురవడం తో  పాటు  తీవ్రమైన కోపం, ఆందోళన, నిరాశ వంటివి వారిని వేధిస్తూ ఉంటాయి.

BPD makes you commit suicide
BPD makes you commit suicide

బీపీడీ ఉన్న వ్యక్తులు ఎక్కువ‌గా ఆందోళ‌న‌, కుంగుబాటులో  ఉండడం  తో పాటు ప్ర‌తిదాన్నీ అనుమనిస్తూనే  ఉంటారు . దీంతో వారిఆశక్తులు , అభిరుచులు, విలువలు త్వరగా మారిపోతుంటాయి. ఇలాంటివారు మంచి, చెడు విష‌యాల‌న్నింటినీ విప‌రీత ధోర‌ణిలో ఆలోచిస్తారు.

క్ష‌ణాల్లో ఎదుటి వారి పై త‌మ అభిప్రాయాల‌ను మార్చుకుంటారు. ఒక్కోసారి ఎదుటి వారికి విప‌రీత‌మైన గౌర‌వమిస్తారు. అంత‌లోనే వారిని చుల‌క‌న‌గా చేసి మాట్లాడేస్తూ ఉంటారు .ఇలాంటి వారు ఒంట‌రిగా ఉండేదుకు ఇష్ట‌ప‌డ‌తారు. గాయ‌ప‌ర‌చుకోవ‌డం, ఆత్మహత్య ప్ర‌య‌త్నాలు చేయ‌డం వంటివి సాధార‌ణంగా వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు. ఎప్పుడూ ఏదో కోల్పోయిన‌ట్టు గా ఉంటారు . ఎప్పుడూ ఏదో ఒక అప‌రాధ‌ భావం తో ఉంటారు. ఇలాంటి  కొన్ని క్ష‌ణాలు  వారిని కొన్ని రోజుల వ‌ర‌కూ వేధిస్తాయి. అస్సలు ఈ  బీపీడీ బారిన ప‌డ‌టానికి గల కారణాలు తెలుసుకుందాం.

ఇది జన్యుప‌ర‌మైన స‌మ‌స్య‌ కావడం వలన కుటుంబం లో ఎవ‌రైనా ఇలాంటి మాన‌సిక స‌మ‌స్య‌ల బారిన ప‌డిన‌వారు ఉంటే వంశ‌పారంప‌ర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది . పెరిగిన వాతావ‌ర‌ణం, ఎదురైన వ్య‌క్తులు, పర్యావరణ పరిస్థితులు వంటివి కూడా బీపీడీ కి దారితీసే అవ‌కాశం ఉంది.  బాల్యం లో చూసిన‌, అనుభ‌వించిన‌ బాధాకరమైన సంఘటనలు ఈ వ్యాది ని  మ‌రింత ఎక్కువ చేస్తాయి. దీని బారిన ప‌డిన వారిలోఎక్కువ మంది తల్లిదండ్రుల‌ నిర్లక్ష్యానికి గురైన‌వారు, బాల్యంలో శారీరక, లైంగిక, మానసిక వేధింపులను ఎదుర్కొన్న‌వారు ఉంటున్న‌ట్టు వైద్యులు తెలియచేస్తున్నారు .

బీపీడీ బారిన ప‌డిన వారిని ఒంట‌రిగా వదిలేయకూడదు . వారిని ఇత‌రుల‌తో క‌లిసి ఉండేలా చూడాలి. నిపుణుల సూచ‌న‌ల‌తో మందులు వాదించడం ,సైకోథెర‌పీ చేయించ‌డం, కౌన్సెలింగ్ ఇప్పించండం.. వంటివి మంచి ఫ‌లితాలు ఇస్తాయి. కానీ కోలుకోవడానికి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు.

 

 

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju