Brahmamudi అక్టోబర్ 16 ఎపిసోడ్ 228: నిన్నటి ఎపిసోడ్ లో,స్వప్న అబార్షన్ నాటకం ఫైల్ అవడం, కావ్య కి రాజ్ సేవలు చేయడం, అది అంతా తాతయ్య గారి కోసం చేస్తున్నారని కావ్య బాధపడడం జరుగుతుంది. అప్పుకి కళ్యాణ్ అనామిక గిఫ్ట్ కొనివ్వడం, అప్పు గురించి కళ్యాణ్ తను బండరాయి అంటూ కామెంట్స్ చేయడం, ఆ మాటలకి ఫీలయ్యి అప్పు ఏడుస్తూ షాప్ నుండి బయటికి వెళ్లడం జరుగుతుంది.కావ్య రాజ్ ప్రేమ తనకు ఎప్పటికీ కావాలని దేవుడి ఎదుట మోర పెట్టుకోవడం జరుగుతుంది.

ఈరోజు228 వ ఎపిసోడ్ లో,హాల్లో అందరూ కూర్చొని టీ తాగుతూ ఉంటారు అప్పుడే కనకం వాళ్ళు అక్కడికి వస్తారు. కావ్య సంతోషంతో ఎదురు వెళ్తుంది ఇక రుద్రాణి ఎందుకు వచ్చారు అన్నట్టుగా మాట్లాడుతుంది. రుద్రాణి మాటలకు ఇందిరా దేవికి కోపం వస్తుంది. వెంటనే అపర్ణతో రేపటి నుంచి రుద్రానికి కాస్త అన్నం పెట్టండి అని అంటుంది. అపర్ణ అదేంటత్తయ్య అని అంటుంది మరి అన్నం తింటే ఇలాంటి మాటలు మాట్లాడేది అని అంటుంది.

కావ్య ని సపోర్ట్ చేసిన రాజ్..
ఇక కనకం వాళ్లు రుద్రాణి అన్న మాటలకు ఫీలవుతూ ఉంటారు. అది గమనించిన రాజ్ కూర్చుండ అత్తయ్య, మీరు పెద్దవాళ్లు అంటూ గౌరవంగా పైకి లేచి కూర్చోమంటాడు కనకం పర్వాలేదు బాబు అని నిలబడే ఉంటుంది. రావడానికి కాస్త ఆలోచించాం కానీ మా స్వప్న పడబోయింది అని తెలిసి చూద్దామని వచ్చాము అని అంటాడు కృష్ణమూర్తి. మా అదృష్టం బాగుంది మా అందరి ముందే పడపోయింది లేదంటే నేను నా కొడుకు కలిసి మెట్ల మీద నుంచి కిందకు తోసేసాము అని మీరే కేసు పెట్టే వాళ్లేమో అంటుంది రుద్రాణి వెటకారంగా, కనకం వాళ్లు రుద్రాణి అన్న మాటలకు ఫీలవుతూ ఉంటారు. ఇక రాజ్ మీరు చాలాసేపటి నుంచి నించోనే ఉన్నారు కూర్చోండి. అని రుద్రా నీ మీద ఫైర్ అవుతాడు రాజ్,అత్త చాలాసేపటి నుంచి నీ కొడుకు ఏమైనా నిన్ను అడ్డుకుంటాడేమో అని చూస్తున్నాను.కానీ వాడు ఏం మాట్లాడకుండా వినోదం చూస్తున్నాడు కనీసం వాడి పెళ్ళానికైనా ఉండాలి. ఆవిడ అక్కడ కూర్చొని సూప్ తాగుతుంది నా భార్య నయం పుట్టింటి మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు అని రాజ్ కోపంగా, రుద్ర నీ వైపు రాహుల్ వైపు స్వప్న వైపు చూస్తాడు. ఆ మాటలకు వెంటనే స్వప్న పైకి లేచి కనకం దగ్గరికి వెళ్లి అమ్మ అంటూ హగ్ చేసుకుంటుంది ఎలా ఉన్నావు? కడుపుతో ఉన్న దానివి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అమ్మ అంటుంది కనుకమ్.అదేం లేదమ్మా కాలు స్లిప్ పై పడబోయాను సరే అని కూర్చోమని స్వప్నని జాగ్రత్తగా కూర్చోబెడుతుంది కనుకమ్. వెంటనే ఇందిరా దేవి మా వాళ్ళ అన్న మాటలు మీరేం పట్టించుకోకండి అని అంటుంది. మాకు అలవాటైపోయింది లేండి అంటుంది కనకం. ఇక ఇంతలో ఇందిరాదేవి మీ అమ్మాయికి మేము ఎలాగూ శ్రీమంతం చేయాలి అనుకుంటున్నాం. ఆ తర్వాత మీరే ఇంటికి తీసుకెళ్లొచ్చు ఈలోపు తనని చూసుకోవడానికి వేరే బయట మనిషిని మాట్లాడదాం అనుకున్నాము. టయానికి మీరు వచ్చారు కాబట్టి మీరే మీ అమ్మాయిని దగ్గరుండి చూసుకోండి అని అంటుంది ఇందిరాదేవి.

కావ్య భయం..
ఇక వెంటనే స్వప్న వామ్మో అమ్మ ఇక్కడ ఉంటే కచ్చితంగా నాకు కడుపు లేదని తెలిసిపోతుంది. వెంటనే అమ్మ ఇక్కడ ఉంటే అత్తయ్య రుద్రాణి అనే మాటలు అమ్మ భరించలేదు అని కావ్య కూడా మనసులో ఆలోచిస్తూ ఉంటుంది అందుకే అమ్మ ఎందుకు లేండి అమ్మమ్మ గారు ఎవరినైనా బయట వాళ్ళని పెట్టుకుందాం అని, అత్తయ్య చెప్పినట్టు చేద్దాం అని అంటుంది కావ్య అయితే సీతారామయ్య అది కాదులే మమ్మీ అయితే జాగ్రత్తగా చూసుకుంటుంది అని కావ్య అని ఒప్పిస్తారు. అపర్ణ వేరే వాళ్ళని మాట్లాడదాం అనుకున్నాం కదా అత్తయ్య అని అంటుంది. వాళ్ళ అమ్మే వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎందుకు అని ఇందిరా దేవి అంటుంది. అదంతా నచ్చక అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది. ఇక ఈ మట్టి వాసన నేను ఎలా భరించాలో దేవుడు ఆ రోజు ఇక్కడే ఉంటారుగా వాళ్ల వీళ్లు అని రుద్రాణి కూడా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కనకం చేసేదేం లేక ఇంట్లోనే ఉండిపోతుంది. కృష్ణమూర్తి నేను వెళ్లి బట్టలు పంపిస్తాను అని బయలుదేరుతాడు. వెళ్తూ వెళ్తూ భార్యతో జాగ్రత్తగా ఉండు రుద్రాణి అనే మాటలు పట్టించుకోకు నీ నోటి దురుసు కాస్త అదుపులో పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు.

అప్పు చీర కట్టుకోవడం..
ఇక అప్పు కళ్యాణి ఇచ్చిన చీరను టీ షర్ట్ మీద వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది.కళ్యాణ్ అన్న మాటలన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. తను ఒక రాయి ప్రేమగీమా అంటే తనకు పడవు నీలాగా పద్ధతిగా ఉండే ఆడవాళ్లు తనకు ఇష్టం ఉండదు అని కళ్యాణ్ అప్పు గురించి మాట్లాడిన మాటలు అన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ చీరని తీసేసి అక్కడ పడేసి, కళ్యాణ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉండగా తలుపు కొట్టిన శబ్దం అవుతుంది. ఎవరొచ్చారు అనుకోని తలుపుతీస్తే కళ్యాణ్ ఎదురుగా నిలబడి ఉంటాడు. కళ్యాణ్ లోపలికి వెళ్లి ఏంటి బ్రో? అలా వచ్చేసావు ఏదో పని ఉందని అనామిక ఎంత ఫీల్ అయిందో తెలుసా అని అంటాడు. దేనికి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటుంది. నీతో తను టైం స్పెండ్ చేయాలి అనుకుంటే నువ్వు వచ్చేసావు కదా అవును నీకు చీర నచ్చలేదు కదా అని అంటాడు కళ్యాణ్ ఎవరు చెప్పారు అని అంటుంది. పక్కనే పడి ఉన్న చీరని చూసి వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు దీన్ని చూస్తేనే అర్థమవుతుంది అని అంటాడు కళ్యాణ్.

అప్పు బాధ..
కళ్యాణ్ అప్పుతో నీకు ఇవన్నీ నచ్చవని నాకు తెలుసు, అయినా అనామికే చెప్పింది వినకుండా ఆడవాళ్లు మనసు అంటూ ఏదో చెప్పి నీకు చీర పెట్టింది.నువ్వు ముందు నుంచి బాగా క్లారిటీతో ఉన్నావు కదా నేనే కన్ఫ్యూషన్ లో ఉన్నాను అంటుంది అప్పు. అవునా ఏ విషయంలో అని అంటాడు కళ్యాణ్ ఏం లేదులే అని అంటుంది అప్పు. అయినా నేను మొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ కదా మళ్లీ నేను తిరిగి తీసుకుంటే బాగోదు నీ దగ్గరే నా గుర్తుగా పెట్టుకో అని అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు వచ్చిన పని చెప్పు అని అంటుంది అప్పు. అవును కదా వచ్చిన విషయం మర్చిపోయాను ఇంట్లో నిశ్చితార్థం వద్దు నేరుగా పెళ్ళే చేద్దాం అంటున్నారు. పోనీలే నీ కన్నా మీ ఇంట్లో వాళ్ళు బాగా ముందుగా ఆలోచిస్తున్నారే అని అంటుంది అప్పు. ఎప్పటినుంచో నా పెళ్లి చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు కదా అందుకే తొందరగా చేయాలి అనుకుంటున్నారు.ఇక కళ్యాణ్ చీర అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు అప్పు బాధగా అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది.
అపర్ణాదేవి కోపం..
ఇక అపర్ణాదేవి కోపంగా గదిలోనే కూర్చుని ఉంటుంది అది గమనించిన సుభాష్ ఏంటి అలా ఉన్నావ్ అని అడుగుతాడు కనకం వాళ్ళు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అని తన మనసులో ఉన్న కోపాన్నంతా వెళ్లగకుతుంది అపర్ణ. అపర్ణ అన్న మాటలకు సుభాష్ నువ్వు వాళ్ల గురించి ఏమైనా అనుకుంటే అది నీ ఒపీనియన్ మాత్రమే, అందరికీ నచ్చినప్పుడు నీ ఒక్కదానికి నచ్చకపోతే నీ మనసులోనే పెట్టుకొని నువ్వు ఒక్కదానివే బాధపడు అని అంటాడు. అయినా అన్నిమర్చిపోయి నీ కొడుకే సంతోషంగా ఉంటుంటే నువ్వెందుకు ఇలా ఉంటావు. ఏదైనా ఉంటే మనసులో పెట్టుకో ముందు కిందకి పదా తిందాం అని అంటాడు.

కనకాని అవమానించిన రుద్రాణి..
ఇక అపర్ణాదేవి తినడానికి కిందకి వస్తుంది ఇందిరాదేవి ప్రకాశం సీతారామయ్య అందరూ కూర్చొనిడైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటారు. అపర్ణ దేవిని చూసి కావ్య కూర్చుండ అత్తయ్య అంటుంది. ఇక అపర్ణాదేవి కోపంగా అక్కడే కూర్చుని అన్నం తినడానికి సిద్ధపడుతుంది. కావ్య వాళ్ళ అమ్మని కూడా కూర్చోమని అంటుంది కానీ కావ్య అపర్ణాదేవికి భయపడి వద్దులేమ్మా తర్వాత తింటాను అని అంటుంది.ఇక వెంటనే రుద్రాణి వెటకారంగా నా రూమ్ లో చాప ఉంది తీసుకొచ్చి మీ అమ్మకి వెయ్యి వాళ్లకి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం అలవాటు ఉండదు కదా అని అంటాడు. వెంటనే రుద్రాణి అన్న మాటలకు రాజ్ కోప్పడతాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా రుద్రాణి మీద ఎగబడతారు. వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను ఇలా చూసుకోరు వాళ్ళు నన్ను చాలా గౌరవంగా చూసుకుంటారు మా అత్తగారిని అలా అనడం నాకు నచ్చలేదు అంటాడు రాజ్. ఇక రాజు బతిమిలాడి కనకాన్ని వాళ్ళ అమ్మ పక్కనే కూర్చోబెడతాడు. అదంతా అపర్ణాదేవికి నచ్చదు. అక్కడ ఇష్టం లేకపోయినా అందరి కోసం కూర్చుని ఉంటుంది.
రేపటి ఎపిసోడ్ లో రాజ్ లోని లవర్ బాయ్ బయటికి వస్తాడు. నువ్వు కళావతిని ప్రేమించడం మొదలు పెట్టావు అని అంటాడు. నీలో కోపం పోయింది కళావతి మీద ప్రేమ పెరిగింది అంటూ చెబుతూ ఉంటాడు. ఇక కళావతి నాకు ఇప్పుడు కిల్లి తినాలని ఉంది అని అంటుంది సరే నీ చేత నేను ఎలాగైనా ఈరోజు కిల్లి తినిపిస్తాను అని కావ్యను తీసుకొని బండిమీద బయటికి వెళ్తాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందికావ్య.