NewsOrbit
న్యూస్ సినిమా

Brahmanandam Birthday Special: ఓన్లీ వన్ స్టార్.. ది కమెడీయన్ స్టార్.. ‘బ్రహ్మీ’

Brahmanandam

బ్రహ్మానందం.. తెలుగు ప్రేక్షకులు ఈయన ఎవరో తెలియని వారంటూ ఉండరు. లెక్చరర్‌గా జీవితం మొదలుపెట్టిన ఈయన.. ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడంటే దాని వెనక ఎంతో కష్టం, కృషి దాగి ఉంది. తెలుగు సినిమా హాస్య నటుల్లో ఎంతో మంది తారలున్నా.. బ్రహ్మానందం మాత్రం ఒక ధృవతార అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆయన పలు భాషల్లో 1,250కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన సినిమాలో ఉన్నాడంటే.. పగులబడి నవ్వొచ్చు అనే మార్క్ ను క్రియేట్ చేశారు. తన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బ్రహ్మానందం ఈ రోజు (బుధవారం) 67వ పడిలో అడుగు పెట్టారు. నేడు కామెడీ లెజండ్ బ్రహ్మానందం పుట్టిన రోజు.

Brahmanandam
Brahmanandam

తన కామెడీ టైమింగ్స్ తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కొన్నేళ్లపాటు ఓ ఊపు ఊపారు. ఒక దశలో విడుదలైన దాదాపు ప్రతీ సినిమాలో బ్రహ్మానందం కనిపించేవాడు. ప్రస్తుతం ఆయన వయసు పైబడటంతో కొంచెం ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి దూరమైనా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. బ్రహ్మానందం ఒక సినిమా చేస్తుండటే చాలు.. స్టార్ హీరోలకు పడే విజిల్స్ పడతాయి. మెగాస్టార్ చిరంజీవి పట్టుకొచ్చిన ఈ టాలెంట్‌.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి నవ్వుల చిరంజీవిగా మారిపోయాడు.

Brahmanandam
Brahmanandam

కెరీర్ ప్రారంభం

దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ దర్శకత్వంలో నరేశ్ కథానాయకుడిగా నటించిన ‘శ్రీతాతావతారం’ అనే సినిమాలో బ్రహ్మానందం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 1987లో జంధ్యాల తెరకెక్కించిన ‘అహ నా పెళ్లంట’ సినిమాతో బ్రహ్మానందం నటించారు. ఈ సినిమాతోనే బ్రహ్మానందం కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో అరగుండు పాత్రలో తన యజమాని పిసినారి తనాన్ని బాహాటంగా కక్కలేక.. తనలోనే అగ్గిబుగ్గలైపోతూ.. ఆక్రోశాన్ని దిగమింగుకొని.. ‘పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా.. పోతావ్‌రా రేయ్.. నాశనమై పోతావ్..’ అంటూ చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ నవ్వులు పూయిస్తాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన 36 ఏళ్ల సినీ కెరీర్‌లో అర డజన్ నంది అవార్డులతోపాటు ఒక ఫిల్మ్ ఫేర్, మూడు సైమా అవార్డులను సొంతం చేసుకున్నాడు. 2009లో బ్రహ్మానందంకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసింది.

Brahmanandam
Brahmanandam

మీమర్స్ కు దేవుడిగా..

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం భారీగా అభివృద్ధికి వచ్చింది. సినిమాలతో సెటైర్లు వేసే మీమర్స్ భారీగా పుట్టుకొచ్చారు. ఆ మీమర్స్ కు అందరికీ దేవుడిగా బ్రహ్మానందం కొనసాగుతున్నారు. చాలా వరకు మీమర్స్ బ్రహ్మానందం సినిమాలో వేసిన డైలాగ్స్, సీన్స్ లతోనే మీమ్స్ రన్ అవుతుంటాయి. అవి రిపీట్ అయినప్పటికీ.. ఏమాత్రం బోర్ కొట్టవు. సోషల్ మీడియాలో బ్రహ్మీ మీమ్స్ షేక్ చేస్తుంటారు. ఒకరకంగా ఈ నవ్వుల రారాజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవడానికి మీమ్స్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అలాంటి లెజెండరీ కమెడీయన్ బ్రహ్మానందం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్నీ జరుపుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

author avatar
Raamanjaneya

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu