Brahmanandam : బ్రహ్మానందం .. తెలుగులో కామెడీ రారాజు.. ఈ నవ్వుల మహారాజు.. ఈరోజు హాస్య బ్రహ్మ పుట్టినరోజు .. ఈ సందర్భం గా సోషల్ మీడియా లో మిమ్స్ ద్వారా చేసే వారు కొంతమంది బ్రహ్మానందం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిజేశారు.. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మిడియా లో వైరల్ అవుతోంది..
సోషల్ మీడియా లో మిమ్స్ ద్వారా కనిపిస్తునందుకు, కనిపించేలా చేసినందుకు నా మిత్రులకు హృదయ పూర్వక నమస్కారాలు .. ఇలాగే మీరు చేస్తూ ఉండండి. నేను ఇస్తూనే ఉంటాను. ఇదొక అన్ లాకింగ్ చైన్ లాగ నా ఎక్సప్రెషన్స్ , మీరు మిమ్స్ లో పెట్టడం మీరు , నేను, అందరం కలసి ప్రేక్షకులను హ్యాపీ గా ఉంచుదాం అని తెలియజేసారు.. అందరూ సంతోషం, హ్యాపీ గా ఉండాలని బ్రహ్మానందం అన్నారు..
ఈయన 1987 లో అహ నా పెళ్ళంట సినిమా తో తొలి నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.. ఆ తర్వాత వరుసగా 5 నందులు, ఒక ఫిలిం ఫేర్ , సైమా , మా అవార్డులతో పాటు 2010 లో పద్మ శ్రీ పురస్కారం దక్కింది.. వివిధ భాషల్లో 1000 కి పైగా సినిమా లలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నారు హాస్య బ్రహ్మ.. ఈ నవ్వుల మహారాజు లో మరో అద్భుతమైన టాలెంట్ చిత్రలేఖనం.. ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తాండ సినిమా లో నటిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!