Brahmanandam: మీమ్స్‌పై క్రేజీగా ఫీల్ అవుతున్న బ్రహ్మానందం.. షాక్ లో ఆలీ?

Share

Comic Memes: సోషల్ మీడియా పుణ్యమాని మనవాళ్ళు తెగ మీమ్స్ తయారు చేసి పారేస్తున్నారు. మీమ్స్ అనేవి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యాయి. దీనికి కారణం ఒక్కటే. బేసిగ్గా మీమ్స్ అన్నీ కూడా కామెడీ బేస్ చేసుకొని చేసేవే. అలాగే ప్రతీ మీమ్ కూడా మన తెలుగు కామెడీ బ్రహ్మ అయినటువంటి బ్రహ్మానందం గారిని సపోర్ట్ గా తీసుకునే తయారు చేస్తున్నారు. అందువల్ల ఈ మధ్యకాలంలో బ్రహ్మి ఎక్కడికి వెళ్లినా ఈ మీమ్స్ గురించి అత్యధిక ప్రశ్నలు వేస్తున్నారు. అలాగే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి వెళ్ళిన బ్రహ్మి దీని గురించి స్పందించారు.

మీమ్స్ పైన బ్రహ్మానందం రియాక్షన్ ఇదే!

తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకు గెస్టుగా బ్రహ్మానందం వెళ్లారు. వెళ్లి వెళ్ళగానే ఆలీ బ్రహ్మానందంపైన ప్రశ్నలు దాడికి దిగారు. అందులో ముందుగా ఈ మీమ్స్ గురించే అడిగారు. మీమ్స్‌పై మీ స్పందన ఏంటని ప్రశ్నించారు ఆలీ. దానిపై బ్రహ్మి మాట్లాడుతూ… ”ఈ సందర్భంగా మీమ్స్ క్రియేట్ చేసే వాళ్లకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల ప్రస్తుతానికి నేను సినిమాల్లో నటించలేకపోతున్నాను. కానీ ఈ మీమ్స్ పుణ్యమాని ఆ లోటు నాకు వెలితిగా కనిపించడం లేదు. వీటి వలన నేను ఇంకా నటిస్తున్నాను అనే భావం కలుగుతోంది.” అని అన్నారు.

ఆలీ రియాక్షన్ ఈ విధంగా వుంది…

దానికి ఆలీ స్పందిస్తూ.. “బాబాయ్! మీమ్స్ గురించి చెబితే నువ్వు తిడతావని అనుకున్నాను. కానీ నేను ఊహించని విధంగా మీరు స్పందించారు. చాలా థాంక్స్ బాబాయ్!” అని అన్నారు. ఈ సందర్భంగా మీమ్స్ క్రియేటర్స్ కి ఆలీ ఓ సలహా ఇచ్చారు. అదేమంటే, “మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఉపయోగించుకోండి. కానీ ఎక్కడా శృతి మించి పోస్టులు పెట్టడం గాని, ఎడిటింగులు గాని చేయవద్దు.” అని విజ్ఞప్తి చేసారు.


Share

Related posts

మార్కెట్ లోకి కరోనా బిడ్డ… 10 రెట్లు ప్రమాదకరం..!

Varun G

బిగ్ బాస్ 4: హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన హారిక మదర్ మోనాల్ పై సెటైర్లు..!!

sekhar

`మ‌న్మ‌థుడు 2` ఫ్యామిలీతో నాగ్‌

Siva Prasad