Breaking: మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివారులోని క్యాంప్ సైట్ లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతి చెందగా, 51 మంది గల్లంతు అయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొండ చరియలు విరిగిపడిన సమయంలో మొత్తం 79 మంది శిబిరంలో ఉన్నారని న్యూ స్ట్రైయిట్ టైమ్స్ నివేదించింది. కొండచరియలు విరిగిపడిన సమయంలో 23 మంది సురక్షితంగా బయటపడ్డారనీ, ముగ్గురు గాయపడ్డారని ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్ మెంట్ తెలిపింది.

ఘటన సమాచారం తెలియడంతో అగ్నిమాపక, వాలంటరీ ఫైర్ అసోసియేషన్, ప్రైవేటు ఫైర్ డిపార్ట్ మెంట్, పోలీస్, మలేషియా సివిల్ డిఫెన్స్ ఫోర్స్, హెల్త్ మినిస్ట్రీ తదితర ఏజన్సీలు సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మూడు ఎకరాల విస్తీర్ణంలో 30 మీటర్ల ఎత్తులో కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు.
సెలంోగర్ ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ డాతుక్ నోరజామ్ ఖామిస్ మాట్లాడుతూ తెల్లవారుజామున 2.24 గంటలకు ఘటనకు సంబంధించి సమాచారం అందడంతో 3 గంటల నుండి రెస్య్కూ టీమ్ లు చేరుకోవడం ప్రారంభించాయని తెలిపారు. గాలింపు, సహాయక చర్యలు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు.