Breaking: టాలీవుడ్ నటుడు దాసరి అరుణ్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఈ రోజు అరుణ్ కుమార్ కారు వేగంగా నడుపుతూ రెండు బైక్ లను ఢీకొట్టారు. కారు నడుపుతున్న సమయంలో అరుణ్ కుమార్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయిస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటన వద్ద సీసీ పుటేజ్ పరిశీలించిన బంజారాహిల్స్ పోలీసులు.. దాసరి అరుణ్ పై కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాద ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్ లో జరిగింది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు అరుణ్ కుమార్ ను పోలీస్ స్టేషన్ కు విచారణ చేస్తున్నట్లు సమాచారం. డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే మాత్రం వెంటనే అరెస్టు చేసి కోర్టుకు హజరుపరిచే అవకాశం ఉందని అంటున్నారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు కుమారుడైన అరుణ్ కుమార్..పలు సినిమాల్లో హీరోగా నటించారు.