AFGHANISTHAN కాబూల్ విమానాశ్రయం ప్రవేశద్వారం వద్ద పేలుడు జరిగినట్లు అమెరికా ప్రభుత్వం ధృవీకరించింది. వెస్ట్రన్ నిఘా సంస్థలు ఉగ్రవాద దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే బాంబు పేలడం కలకలం సృష్టిస్తోంది. కాబూల్ విమానాశ్రయం వద్దకు వెళ్లొద్దని.. ఉగ్ర దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆఫ్ఘన్లను యూకే ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే బాంబు పేలింది. బారన్ హోటల్ సమీపంలో పేలుడు సంభవించిన తరువాత తమ సైనికులు ఎవరూ చనిపోలేదన్నట్లు బ్రిటిష్ రక్షణ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పౌరుల పరిస్థితి గురించి ఇంకా తెలియరాలేదు.
BREAKING : AFGHANISTHAN — కాబూల్ ఎయిర్ పోర్ట్ లో బాంబు పేలుడు !!
కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అబ్బే గేట్ వద్ద బాంబు పేలినట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ ట్విట్టర్లో ధృవీకరించారు. ఆ తర్వాత కాల్పులు జరిగాయని.. అనేక పశ్చిమ దేశాలు ఇప్పటికే తమ తరలింపు విమానాలను నిలిపివేశాయని సమాచారం. కాబూల్ విమానాశ్రయం వెలుపల పేలుడు సంభవించిందని కానీ ప్రాణనష్టం గురించి ఇంకా తెలియరాలేదని.. పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.
BEER :మీ ఇంట్లో వారు మిమల్ని మందు తాగడం మానేమంటున్నారా? అయితే ఈ కారణం చెప్పండి..!