ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేసిన పీఆర్సీ సాధన సమితి

Share

Breaking: ఏపి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతల నేడు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేశారు. వచ్చే నెల 6వ తేదీ అర్దరాత్రి నుండి సమ్మెలోకి వెళుతున్నట్లు నేతలు పేర్కొన్నారు. ఓ పక్క చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించిన సంప్రదింపుల కమిటీ ప్రతినిధులు మంత్రుుల బొత్స సత్యనారాయణ, పేర్ని నాని తదితరులు సచివాలయంలో చాలా సేపు వేచి చూశారు. వీరి ఆహ్వానాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. నూతన పీఆర్సీ జీవో విరమించుకుంటేనే చర్చలకు వస్తామని వీరు స్పష్టం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ చర్చలకు రావచ్చని రేపు మరో సారి ఉద్యోగ సంఘాలను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Breaking: జీఏడీ ముఖ్య కార్యదర్శికి నోటీసు అందజేత

ఇదిలా ఉంటే పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో జేేఏడీ ముఖ్య కార్యదర్శికి నోటీసు ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యయులు, పెన్షనర్ల సంఘాల నుండి పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ గా ఏర్పడినట్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. నూతన పీఆర్సీ జీవోలను ఉపసంహరించుకునే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ అభిప్రాయాలను తెలుసుకోకుండా జీవోలు జారీ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. నిరసన కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్న స్ట్రగుల్ కమిటీ నేతలు నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.


Share

Related posts

Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!!

bharani jella

పవన్ కళ్యాణ్ కి బంపర్ ఆఫర్ ప్రకటించిన కేఏ పాల్..!!

sekhar

Jogging: జాగింగ్ ఉదయమా.!? సాయంత్రమా.!? ఎప్పుడు మంచిదంటే.!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar