NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : సోముకి పెద్ద షాక్ ! అసలైన బీజేపీని చూపించిన రాంమాధవ్

ఏపీలో బీజేపీ నేతలు ఎవరికి వారు అమరావతిపై తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. అయితే అది ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన సోము వీర్రాజుకు నచ్చితే పార్టీలో ఉంటారు.

somu veeraju suspension on AP BJP
somu veeraju suspension on AP BJP

 

ఆయనకు నచ్చకపోతే సస్పెండ్ చేస్తారనే సెటైర్లు బీజేపీలోనే వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవ సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. ఏపీ రాజకీయాల బాధ్యత మొత్తం తనదేనని రామ్‌మాధవ్ మాత్రం జగను ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీ లాంటి రాష్ట్రానికే మూడు రాజధానులు లేవు ..ఏపీకి ఎందుకని ప్రశ్నించారు. అవినీతి కోసమే.. మూడు రాజధానులు పెడుతున్నారని ఆరోపించారు.

ఈ విషయం లో కేంద్రం కల్పించుకోవాలంటే కల్పించుకోగలదని,అయితే హైకోర్టులో అఫిడవిట్ తన పరిధి మేరకే వేసిందని ఆయన హింట్ కూడా ఇచ్చారు. రామ్మాధవ్ ప్రసంగం తీరు బీజేపీ నేతల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అమరావతి కి మద్దతుగా మాట్లాడిన రామ్ మాధవ్ విషయంలో సోము వీర్రాజు మౌనంగా ఉన్నారు. అంతకు ముందు ఇదే సోము వీర్రాజు అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిని,పత్రికలకు వ్యాసాలు రాసిన వారిని, రైతుల దీక్షా శిబిరాలకు వెళ్లిన వారిని సస్పెండ్ చేశారు.ఇప్పటికి ఐదారుగురు నేతల్ని ఆయన ఇంటికి పంపేశారు. దాంతో.. చాలా మంది నేతలు అమరావతి గురించి నోరెత్తడానికి సిద్ధపడటం లేదు.

కానీ రామ్ మాధవ్ మాత్రం అమరావతి కి మద్దతుగా బహిరంగంగానే తమ గళం వినిపించారు. అయితే రామ్ మాధవ్ అలా ఎందుకు స్పందించారు అన్న విషయమై బిజెపిలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బిజెపి రాజకీయ భాగమని వ్యూహంలో అదో భాగమని, అందుకే ఆయన అమరావతికి మద్దతుగా మాట్లాడారు అంటున్నారు. వైసీపీ ని బిజెపి పూర్తిగా దూరం చేసుకోబోదని, అదే సమయంలో పూర్తిగా వెనకేసుకు కూడా రాదని, అప్పుడప్పుడు బిజెపి నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసి ప్రజల దృష్టిని మళ్ళిస్తుంటారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే అమరావతికి మద్దతిచ్చే వారిని సస్పెండ్ చేసిన సోము వీర్రాజు పరిస్థితి ఏమిటన్నదే బిజెపి లో ఇప్పుడు హాట్ టాపిక్ !

author avatar
Yandamuri

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju